Edx online Program : ఏపీ ప్రభుత్వం ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ టీచింగ్ లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ బోధన విధానాలను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా రూపొందించాయి. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఆన్లైన్ కోర్సులు విద్యార్థులకు అందుబాటులో రానున్నాయి. దీంతో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే విద్యార్థులు అత్యున్నత కోర్సులు నేర్చుకోవచ్చు. హార్వర్డ్, ఎంఐటి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సులో ఏపీ విద్యార్థులు సర్టిఫికెట్లు ఈజీగా పొందవచ్చు.
తద్వారా మంచి వేతనాలతో కూడిన జాతీయ అంతర్జాతీయ ఉద్యోగాలను సాధించేలా ప్రోత్సహిస్తుంది. ఈ కోర్సులకు ఫీజులను ప్రభుత్వమే భరించనుంది.ఎడెక్స్ ప్రపంచంలోనే ప్రముఖ ఈ లెర్నింగ్ ప్లాట్ఫారంగా పేరుపొందింది. ఇందులో 150కి పైగా వరల్డ్ క్లాసు వర్సిటీలు రూపొందించిన వివిధ కోర్సులోని రెండువేలపైగా వర్టికల్స్ను చదువుకోవచ్చు. ఒక్కో కోర్సు చేయాలంటే సుమారు 30,000 ఖర్చఅవుతుంద. ఇంత ఖరీదైన కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల మందికి పైగా విద్యార్థులు, టీచర్లకు ఉచితంగా అందిస్తుంది. దీనికోసం ఏటా సుమారు 50 కోట్లకు పైగా వెచ్చించనుంది. రాష్ట్రంలోని సాంప్రదాయ వర్సిటీలతోపాటు సాంకేతిక విశ్వవిద్యాలయాలు వ్యవసాయ ఉద్యాన వెటర్నిటీలాలంటి 20 విశ్వవిద్యాలయాల పరిధిలోని విద్యార్థులకు ఎడెక్స్ కోర్సులను అందిస్తారు.
ఆయా కళాశాలలో వర్సిటీలు ఎంపిక చేసిన కోర్సులు తప్పనిసరిగా విద్యార్థులు చదవాల్సి ఉంటుంది. ఎడెక్స్ సంస్థ సంబంధిత అంతర్జాతీయ వర్సిటీతో కలిసి విద్యార్థి అసైన్మెంట్స్ ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్ అందిస్తుంది. ఎడెక్స్ రూపొందించిన ప్రశ్న పత్రంతో రాత పరీక్ష వర్సిటీలే నిర్వహిస్తాయి. క్రెడిట్లను కూడా వర్సిటీలై ఇస్తాయి. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ కోర్సులను కూడా చేయవచ్చు. వాటిని వాల్యూ యాడెడ్ కోర్సులుగా పరిగణించి సర్టిఫికెట్ ఇస్తారు.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.