Ys Jagan : 99 పైసలకే వైజాగ్ లో భూములు మాజీ సీఎం జగన్ సెటైర్లు
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ భూకుంభకోణం మళ్లీ చర్చకు దారి తీసింది. తాజాగా మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైజాగ్‌లో 99 పైసలకే విలువైన భూములను కొన్ని అనామక సంస్థలకు అప్పగించారని ఆయన ఆరోపించారు. లూలు గ్రూప్, లిల్లీ గ్రూప్ వంటి పేర్లతో టెండర్లు లేకుండానే సుమారు రూ.1500 కోట్ల విలువైన భూములను ఇవ్వడం అమానుషమని, ప్రజా ధనం పై దోపిడీని తాను సహించనని జగన్ స్పష్టం చేశారు.
Ys Jagan : 99 పైసలకే వైజాగ్ లో భూములు మాజీ సీఎం జగన్ సెటైర్లు
ముఖ్యంగా Ursa అనే ఎవరికీ తెలియని కంపెనీకి విశాఖపట్నంలో 3000 కోట్ల రూపాయల విలువ గల భూమిని కేవలం ఒక రూపాయికి అప్పగించారంటూ తీవ్రంగా సెటైర్లు వేశారు. “ఒక రూపాయికి ఇడ్లీ రాదేమో గాని చంద్రబాబు హయాంలో మాత్రం వేల కోట్లు విలువైన భూములు ఉచితంగా ఇచ్చేవారు” అంటూ జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వం క్రమబద్ధతలేని విధానాలకు నిదర్శనమని ఆయన తెలిపారు.
అమరావతి నిర్మాణ పనుల్లో కూడా భారీ అవినీతి జరిగిందని జగన్ ఆరోపించారు. 2018లో ప్రారంభించిన రూ.36,000 కోట్ల ప్రాజెక్టు విలువను ఇప్పుడు రూ.78,000 కోట్లకు పెంచారని, ఇది పూర్తిగా రింగ్ ఫార్మేషన్ టెండర్ల ద్వారా తన వర్గీయులకే అప్పగించడమని ఆరోపించారు. పైగా మొబలైజేషన్ అడ్వాన్స్ పేరిట 10 శాతం నిధులు విడుదల చేసి, అందులో 8 శాతం కమిషన్లు తీసుకోవడం జరిగింది అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ, నిధులు ఎక్కడికి పోతున్నాయో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారని జగన్ మండిపడ్డారు.
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
This website uses cookies.