Ys Jagan : 99 పైసలకే వైజాగ్ లో భూములు మాజీ సీఎం జగన్ సెటైర్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : 99 పైసలకే వైజాగ్ లో భూములు మాజీ సీఎం జగన్ సెటైర్లు

 Authored By ramu | The Telugu News | Updated on :24 April 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Ys Jagan : 99 పైసలకే వైజాగ్ లో భూములు మాజీ సీఎం జగన్ సెటైర్లు

Ys Jagan : ఆంధ్రప్రదేశ్‌ లో వైజాగ్ భూకుంభకోణం మళ్లీ చర్చకు దారి తీసింది. తాజాగా మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైజాగ్‌లో 99 పైసలకే విలువైన భూములను కొన్ని అనామక సంస్థలకు అప్పగించారని ఆయన ఆరోపించారు. లూలు గ్రూప్, లిల్లీ గ్రూప్ వంటి పేర్లతో టెండర్లు లేకుండానే సుమారు రూ.1500 కోట్ల విలువైన భూములను ఇవ్వడం అమానుషమని, ప్రజా ధనం పై దోపిడీని తాను సహించనని జగన్ స్పష్టం చేశారు.

Ys Jagan 99 పైసలకే వైజాగ్ లో భూములు మాజీ సీఎం జగన్ సెటైర్లు

Ys Jagan : 99 పైసలకే వైజాగ్ లో భూములు మాజీ సీఎం జగన్ సెటైర్లు

Ys Jagan వైజాగ్ లో భూకుంభకోణం అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యంగా Ursa అనే ఎవరికీ తెలియని కంపెనీకి విశాఖపట్నంలో 3000 కోట్ల రూపాయల విలువ గల భూమిని కేవలం ఒక రూపాయికి అప్పగించారంటూ తీవ్రంగా సెటైర్లు వేశారు. “ఒక రూపాయికి ఇడ్లీ రాదేమో గాని చంద్రబాబు హయాంలో మాత్రం వేల కోట్లు విలువైన భూములు ఉచితంగా ఇచ్చేవారు” అంటూ జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వం క్రమబద్ధతలేని విధానాలకు నిదర్శనమని ఆయన తెలిపారు.

అమరావతి నిర్మాణ పనుల్లో కూడా భారీ అవినీతి జరిగిందని జగన్ ఆరోపించారు. 2018లో ప్రారంభించిన రూ.36,000 కోట్ల ప్రాజెక్టు విలువను ఇప్పుడు రూ.78,000 కోట్లకు పెంచారని, ఇది పూర్తిగా రింగ్ ఫార్మేషన్ టెండర్ల ద్వారా తన వర్గీయులకే అప్పగించడమని ఆరోపించారు. పైగా మొబలైజేషన్ అడ్వాన్స్ పేరిట 10 శాతం నిధులు విడుదల చేసి, అందులో 8 శాతం కమిషన్లు తీసుకోవడం జరిగింది అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ, నిధులు ఎక్కడికి పోతున్నాయో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారని జగన్ మండిపడ్డారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది