Roja : హామీలను పక్కనపెట్టి అరెస్ట్ లను నమ్ముకున్న కూటమి సర్కార్ – రోజా
ప్రధానాంశాలు:
Roja : హామీలను పక్కనపెట్టి అరెస్ట్ లను నమ్ముకున్న కూటమి సర్కార్ - రోజా
Roja : కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను తీవ్రంగా తప్పుబడుతూ మాజీ మంత్రి, Ysrcp వైఎస్సార్సీపీ నేత ఆర్కే రోజా Former Minister Roja కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పెట్టిన కేసు పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఇచ్చిన హామీలను అమలు చేయలేని దౌర్భాగ్యాన్ని మరచిపోయేందుకు కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులను మోతాదుగా పెడుతోందని ఆరోపించారు.

Roja : హామీలను పక్కనపెట్టి అరెస్ట్ లను నమ్ముకున్న కూటమి సర్కార్ – రోజా
Roja : వైసీపీ నేతల అరెస్ట్ లపై మాజీ మంత్రి రోజా ఫైర్
“రోజుకో నేతపై అక్రమ కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. టీడీపీ నేతలు మహానాడులో హామీలను అమలు చేశామని ప్రకటించే ధైర్యం ఉందా? ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి, లిక్కర్ స్కామ్, ఇతర కేసుల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. కాకాణి, పిన్నెల్లి లాంటి వైఎస్సార్సీపీ నేతలపై పెట్టిన కేసులు పూర్తిగా రాజకీయం ప్రేరితమైనవే” అని ఆమె ఘాటుగా విమర్శించారు.
జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తే, న్యాయం, రాజ్యాంగ పరిరక్షణకు బలమైన ఉదాహరణను చూపిస్తామని ఆర్కే రోజా స్పష్టం చేశారు. “రెడ్ బుక్ అనే కొత్త రాజ్యాంగం పక్కన పెట్టి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎలా ఉంటుందో చూపిస్తాం” అంటూ తాను చెప్పిన మాటలు రాజకీయ వేడి పెంచుతున్నాయి. ప్రజలు కూటమి నేతలు చేస్తున్న అక్రమాలపై గమనిస్తుండటంతో, రాబోయే రోజుల్లో వారికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.