మద్యం మత్తులో గిరిజన యువకుడిపై దాడి చేసి.. నోట్లో మూత్రం పోసిన ఫ్రెండ్స్.. చివరికి ఊహించని షాక్ ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

మద్యం మత్తులో గిరిజన యువకుడిపై దాడి చేసి.. నోట్లో మూత్రం పోసిన ఫ్రెండ్స్.. చివరికి ఊహించని షాక్ ..!!

 Authored By aruna | The Telugu News | Updated on :19 July 2023,7:00 pm

జనాలు రోజురోజుకి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. మద్యం ఒకటి అలవాటు చేసుకొని ఆ మత్తులో వారు ఏం చేస్తున్నారో కూడా వారికి అర్థం కావడం లేదు. ఇలా మద్యం మత్తులో చాలామంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. అయినా కానీ మద్యం తీసుకోవడం మాత్రం అసలు మానేయరు. వీరికి ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలియదు కానీ రోజు రోజుకి మద్యం అలవాటు వలన తమ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు. తాజాగా ఒంగోలులో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడి పై మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అతని నోట్లో మూత్రం పోసి వీడియో తీశారు. దాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మన్నే రామాంజనేయులు, మోటా నవీన్ ఇద్దరు చిన్నప్పటినుంచి స్నేహితులు. వీరిద్దరూ చెడు తిరుగుళ్ళు తిరుగుతూ నేరాలకు పాల్పడేవారు. వీరిపై దాదాపు 50 దొంగతనం కేసులు ఉన్నాయి. నవీన్ పోలీసులకు పట్టుబడి శిక్ష అనుభవించాడు. రామాంజనేయులు తప్పించుకొని తిరుగుతూ ఉండేవాడు. అయితే కొంతకాలంగా విరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. రామాంజనేయులు పథకం ప్రకారం నవీన్ ని ఒక నెల రోజుల కింద మద్యం తాగటానికి పిలిచాడు. ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రి వెనుక వైపు తీసుకుని వెళ్ళాడు. అక్కడ మరో 9 మంది యువకులు ఉన్నారు.

Friends urine in the young mans mouth while alcohol drinking

Friends urine in the young mans mouth while alcohol drinking

అందరూ కలిసి తాగి మద్యం మత్తులో పాత వివాదం గురించి మాట్లాడుకుంటూ మాటా మాట తిరిగి నవీన్ పై దాడికి పాల్పడ్డారు. అందరూ కలిసి నవీన్ ని చితకబాదారు. అతను వదలండని బ్రతిమాలిన వదలకుండా విచక్షణారహితంగా ప్రవర్తించారు. అంతేకాకుండా బాధితుడు నోట్లో మూత్రం పోసి తాగాలని బలవంతం చేశారు. దానిని ఫోన్లో వీడియో తీశారు. నెల రోజుల కింద జరిగిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పటికే నవీన్ పోలీసులు ఫిర్యాదు ఇచ్చాడు కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది పై అధికారుల దాకా వెళ్లడంతో నవీన్ ను కొట్టిన వాళ్లను పట్టుకొని విచారిస్తున్నారు.

Tags :

    aruna

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది