Home » Andhra Pradesh » Good News For Andhra Pradesh Farmers Annadata Sukhibhava Pm Kisan
andhra pradesh

Annadata Sukhibhava PM Kisan : ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి శుభవార్త..!

Authored By
Sudheer Ramanujam
The Telugu News | Published on: March 11, 2026, 12:30 pm
Advertisement

Annadata Sukhibhava PM Kisan : ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి శుభవార్త చెబుతూ కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకం కింద 3వ విడత నిధులను ఈనెల 13న విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. అస్సాంలోని గువాహటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ 22వ విడత నిధులను విడుదల చేయనుండగా, అదే రోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వాటాను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విడతలో ప్రతి రైతుకు మొత్తం రూ.6,000 అందనున్నాయి. ఇందులో కేంద్రం పీఎం కిసాన్ కింద రూ.2,000 ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.4,000 అదనంగా జోడించి నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు (DBT) బదిలీ చేయనుంది.

Advertisement

Annadata Sukhibhava PM Kisan : ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి శుభవార్త..!

Annadata Sukhibhava PM Kisan : రైతుల దిగులు తీరినట్లే.. రైతుల ఖాతాల్లోకి మోడీ డబ్బులు

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 46.80 లక్షల మంది రైతులకు ఈ నిర్ణయం వల్ల లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ.2,808 కోట్లను కేటాయించింది. ఎన్నికల హామీ మేరకు పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ కలిపి ఏడాదికి ఒక్కో రైతుకు రూ.20,000 పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే రెండు విడతల్లో రూ.14,000 చొప్పున మొత్తం రూ.6,309.44 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇప్పుడు అందజేయబోయే రూ.6,000తో కలిపి ఈ ఏడాదికి ఇచ్చిన హామీని ప్రభుత్వం పూర్తి చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించి, సాగుకు అవసరమైన పెట్టుబడిని సకాలంలో అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Advertisement

Annadata Sukhibhava PM Kisan : ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి శుభవార్త

కేవలం పెట్టుబడి సాయమే కాకుండా, ప్రకృతి విపత్తుల సమయంలో దెబ్బతిన్న పంటలకు ఇచ్చే పరిహారాన్ని కూడా ప్రభుత్వం గణనీయంగా పెంచింది. వరి సాగు చేసే రైతులకు హెక్టారుకు ఇచ్చే సాయాన్ని రూ.17,000 నుంచి రూ.25,000కు పెంచడం విశేషం. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు సుమారు 2 లక్షల మంది రైతులకు రూ.310 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని అందజేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న రైతు ఆత్మహత్యల పరిహార నిధులను కూడా ప్రస్తుత ప్రభుత్వమే విడుదల చేసింది. రబీ సీజన్‌లో సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవడం, రైతు సేవా కేంద్రాల బలోపేతానికి నిధులు కేటాయించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

Sudheer Ramanujam

Author Bio Info : Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి