YS Jagan : జగన్ సూపర్ డూపర్ ఐడియా.. విడుదల ఐన రోజే ఇంట్లోనే కొత్త సినిమా !
YS Jagan : ఒకప్పుడు సినిమా విడుదలైతే థియేటర్లలో మాత్రమే చూసేవాళ్లం. థియేటర్లలో కొన్ని రోజుల వరకు కూడా టికెట్లు దొరికేవి కావు. కానీ.. ఇప్పుడు ఓటీటీ కాలం వచ్చేసింది. నేరుగా ఓటీటీలలోనే సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇంట్లో కూర్చొని ఏం చక్కా సినిమాలను టీవీల్లో చూసుకోవచ్చు. అది కూడా కొత్త సినిమాలను. ఇలాంటి రోజులు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. అదంతా పక్కన పెడితే.. కొత్త సినిమా థియేటర్లలో విడుదల అయిన రోజే..
ఇంట్లోనే కూర్చొని టీవీలో చూసే అవకాశం కూడా వస్తోంది. అలాంటి సదుపాయాన్ని ఏపీ ఫైబర్ నెట్ కల్పిస్తోంది.థియేటర్లలో సినిమా విడుదల కాగానే.. ఇంట్లో టీవీలో ఆ సినిమాను చూసేయొచ్చు. థియేటర్లకు పోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే దానికి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. రూ.99 చెల్లించి ఇంట్లోనే కూర్చొని హాయిగా సినిమా చూడొచ్చు. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ద్వారా కొత్త సినిమాలు థియేటర్ లో విడుదలైన రోజే ఆన్ లైన్ లోనూ విడుదల కానున్నాయి.
YS Jagan : ఫస్ట్ డే.. ఫస్ట్ షో పద్ధతిలో కార్యక్రమానికి రూపకల్పన
ఫస్ట్ డే, ఫస్ట్ షో పద్ధతిలో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమానికి జూన్ 2న వైజాగ్ లో ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభిస్తారు. ఏపీ ఫైబర్ నెట్ కు 99 రూపాయలతో సబ్ స్క్రైబ్ చేసుకోవాలి. సబ్ స్క్రైబ్ చేసుకున్న తర్వాత సినిమా రిలీజ్ అయిన 24 గంటల లోపు ఆ సినిమాను వీక్షించే చాన్స్ ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు థియేటర్లలోకి వెళ్లి సినిమా చూసే అవకాశం లేనివాళ్లకు ఏపీ ఫైబర్ నెట్ ప్లస్ కానుంది. ఇప్పటి వరకు ఏపీలో 37 వేల కిమీల వరకు ఫైబర్ నెట్ కేబుల్స్ వేశారు. మొత్తం 55 వేల కిమీల ఓఎఫ్సీని తీసుకెళ్లే లక్ష్యాన్ని పెట్టుకున్నారు.