Good News : సొంతిళ్లు లేని వారికి గుడ్ న్యూస్ .. కొత్త ఇళ్ల పై ప్రభుత్వం సన్నాహాలు.. పూర్తి వివరాలివే ..!

 Authored By suma | The Telugu News | Updated on :24 February 2026,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Pradhan Mantri Awas Yojana Gramin : సొంతిళ్లు లేని వారికి గుడ్ న్యూస్ .. కొత్త ఇళ్ల పై ప్రభుత్వం సన్నాహాలు.. పూర్తి వివరాలివే ..!

Good News  : ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయనుంది. ఏప్రిల్ నెలలో ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ వరకు దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది తమ గృహావసరాల కోసం అప్లై చేసుకున్నారు. దాదాపు 10.42 లక్షల మంది ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తులు సమర్పించగా, ప్రస్తుతం అధికార యంత్రాంగం వాటి పరిశీలనలో నిమగ్నమైంది. క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తూ నిజమైన అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్‌లో తుది లబ్ధిదారుల జాబితాను విడుదల చేసి మంజూరు పత్రాలు అందజేయనున్నారు.

Good News : సొంతిళ్లు లేని వారికి గుడ్ న్యూస్ .. కొత్త ఇళ్ల పై ప్రభుత్వం సన్నాహాలు.. పూర్తి వివరాలివే ..!

Good News : సొంతిళ్లు లేని వారికి గుడ్ న్యూస్ .. కొత్త ఇళ్ల పై ప్రభుత్వం సన్నాహాలు.. పూర్తి వివరాలివే ..!

Pradhan Mantri Awas Yojana Gramin 2.0 : దరఖాస్తుల పరిశీలన పూర్తి దశలో

పథకం కింద వచ్చిన మొత్తం 10.42 లక్షల దరఖాస్తుల్లో 8.29 లక్షల మంది తమకు స్థలం ఉన్నప్పటికీ ఇల్లు నిర్మించేందుకు ఆర్థిక సాయం కోరారు. మరో 2.13 లక్షల మంది స్థలం మరియు ఇల్లు రెండింటికీ దరఖాస్తు చేసుకున్నారు. వర్గాల వారీగా పరిశీలిస్తే 1.43 లక్షల మంది ఎస్టీలు, 2.16 లక్షల మంది ఎస్సీలు, 4,965 మంది దివ్యాంగులు, 6.92 లక్షల మంది ఇతర వర్గాలకు చెందినవారు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి ఆమోదం కోసం కేంద్రానికి పంపించింది. మార్చి 3వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం ఈ అప్లికేషన్లను పరిశీలించనుంది. ఇప్పటికే సుమారు 60 వేల దరఖాస్తులను కేంద్రం తిరస్కరించినట్లు సమాచారం. వీరిని అనర్హులుగా గుర్తించారు. కేంద్ర ఆమోదం వచ్చిన వెంటనే మిగతా అర్హుల జాబితా ఖరారు చేసి మంజూరు పత్రాలు అందజేయనున్నారు.

Pradhan Mantri Awas Yojana Gramin 2.0 : స్థలం లేనివారికి మూడు సెంట్లు.. అత్యంత పేదలకు తొలి ప్రాధాన్యం

ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, స్థలం లేని నిరుపేదలకు ప్రభుత్వం మూడు సెంట్ల స్థలం కేటాయించనుంది. ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన ఆర్థిక సాయం కూడా అందించబడుతుంది. స్థలం ఉన్నా ఇల్లు లేని వారికి విడతల వారీగా నిధులు జమ చేస్తారు. ఇళ్ల కేటాయింపులో అత్యంత పేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ముఖ్యంగా వితంతువులు, ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు మరియు దివ్యాంగులకు ప్రాధాన్యత కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనంతరం ఇతర అర్హులైన వారికి అవకాశమిస్తారు. జిల్లాల వారీగా చూస్తే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 77,353 దరఖాస్తులు వచ్చాయి. తరువాత శ్రీకాకుళం జిల్లాలో 75,117, అన్నమయ్య జిల్లాలో 68,508 అప్లికేషన్లు నమోదయ్యాయి. అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 7,433 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్రంలో లక్షలాది పేద కుటుంబాల గృహ స్వప్నం సాకారం కానుంది. ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుండటంతో త్వరలోనే లబ్ధిదారులకు సొంతింటి ఆనందం దక్కనుంది.

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి