Nara Lokesh : బ్రేకింగ్ : ఆగిపోయిన లోకేష్ పాదయాత్ర !
Nara Lokesh : అవిరామంగా టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. నారా లోకేశ్ పాదయాత్రకు బ్రేక్ పడేలా ఉంది. ఆయన చాలా రోజుల పాటు పాదయాత్ర చేయాలని గత నెల 27న ప్రారంభించారు. కానీ.. ఆయన పాదయాత్ర ప్రారంభమై నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే బ్రేక్ పడేలా ఉంది. దానికి కారణాలు ప్రభుత్వం కాదు కానీ.. ఈసారి ఎన్నికలే లోకేశ్ పాదయాత్రకు బ్రేక్ వేయనున్నాయి. నారా లోకేశ్ పాదయాత్ర యువగళానికి శాసనమండలి ఎన్నికలు అడ్డు కానున్నాయి. ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఫిబ్రవరి 16న షెడ్యూల్ జారీ అవుతుంది. అయితే.. షెడ్యూల్ ప్రకటించారంటే దాదాపుగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్టే.
ఒక్కసారి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందంటే.. రాజకీయ పార్టీలు ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వకూడదు. బహిరంగ సభలు, ర్యాలీలు ఏవైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్, పోలీసుల అనుమతి ఉండాలి. అలాగే.. ఓటర్లను ప్రలోభపరుచుకునేలా వ్యాఖ్యలు కూడా ఉండకూడదు. అందుకే.. లోకేశ్ పాదయాత్రకు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.13 ఎంఎల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఉమ్మడి 13 జిల్లాల్లో ఎన్నికలు ఉండటం వల్ల.. ఏపీ అంతటా ఎన్నికల కోడ్ ను ఈసీ అమలులోకి తీసుకొచ్చింది.
Nara Lokesh : 12 ఎంఎల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు
ప్రస్తుతం నారా లోకేశ్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలోనే సాగుతోంది. గంగాధర నియోజకవర్గంలో లోకేశ్ ఉన్నారు. మరి లోకేశ్ పాదయాత్రను కంటిన్యూ చేయాలా వద్దా అనేదానిపై క్లారిటీ రానందున కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. దీంతో కమిషన్ నుంచి ఇంకా సమాధానం రావాల్సి ఉంది. అయితే.. నారా లోకేశ్ పాదయాత్రపై మొదటి నుంచి అధికార పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగింపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.