Weather Report : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు .. ఈ జిల్లాలకు వడగాల్పులు .. ఆరెంజ్ అలర్ట్ జారీ.!

Authored By Sudheer Ramanujam | The Telugu News | Published on: April 11, 2026, 12:00 pm
  •  Weather Report : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు .. ఈ జిల్లాలకు వడగాల్పులు .. ఆరెంజ్ అలర్ట్ జారీ.!

Weather Report : ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖన్ జైన్ విడుదల చేసిన ప్రకటనలో రాబోయే రోజుల్లో ఎండల ప్రభావం మరింత తీవ్రమవుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 11న భానుడి కిరణాలు మండిపడే అవకాశం ఉండడంతో పాటు వడగాల్పులు అధికంగా వీచే పరిస్థితులు ఉన్నాయని స్పష్టం చేశారు.

Heatwaves in these districts in Telugu states.. Orange alert issued.!

Heatwaves in these districts in Telugu states.. Orange alert issued.!

Weather Report : రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పుల ప్రభావం

శనివారం ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వేడి గాలులు బలంగా వీచే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా పలు జిల్లాల్లోని మండలాలు వడగాల్పుల ప్రభావానికి లోనవుతాయని హెచ్చరించారు. కాకినాడ జిల్లాలో 2 మండలాలు, తూర్పుగోదావరిలో 4, ఎన్టీఆర్ జిల్లాలో 3, ఏలూరు జిల్లాలో 3 మండలాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో 5, పోలవరం జిల్లాలో 6, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 మండలాలు ప్రమాదానికి గురయ్యే అవకాశముందని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 20, శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండనుందని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలోనే 79 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండనుందని, ఆదివారం నాటికి ఈ సంఖ్య 93 మండలాలకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Weather Report : ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరిక

రాష్ట్రంలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కాకినాడ జిల్లా కరపలో 44.1 డిగ్రీల సెల్సియస్ నమోదవగా కడపలో 43.6 డిగ్రీలు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 42.9 డిగ్రీలు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తం రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. మరోవైపు, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి వర్షాలు పిడుగులతో కూడి పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అయితే ఈ వర్షాలు ఎండ తీవ్రతను తగ్గించడంలో పెద్దగా సహాయపడవని నిపుణులు చెబుతున్నారు.

Weather Report : తెలంగాణలోనూ ఎండల విరుచుకుపాటు

తెలంగాణలో కూడా ఎండల తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నీటిని ఎక్కువగా తాగాలని, తేలికపాటి దుస్తులు ధరించాలని సూచించారు. గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని వడదెబ్బ బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం.

Sudheer Ramanujam

Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp