Anitha : జగన్ పరువు తీసిన హోమ్ మంత్రి.. లేని జనాల్ని చూపించటానికి బంగారుపాళ్యం విజువల్స్ వాడారని విమర్శలు..!
ప్రధానాంశాలు:
జగన్ నెల్లూరు టూర్ పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి అనిత
Anitha : జగన్ పరువు తీసిన హోమ్ మంత్రి.. లేని జనాల్ని చూపించటానికి బంగారుపాళ్యం విజువల్స్ వాడారని విమర్శలు..!
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “అమరావతి జైళ్ల యాత్ర పేరుతో మాజీ సీఎం జగన్ విచిత్ర వేషాలు వేస్తున్నారని” అనిత మండిపడ్డారు. మహిళలను కించపరిచే వారిని ప్రోత్సహించే జగన్ ధోరణి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారలేదని, ఇప్పుడూ పోలేదని ఆమె విమర్శించారు. చెల్లి వరుసయ్యే మహిళా నేతపై వ్యక్తిత్వ హననం చేసిన వారికి జగన్ మద్దతు పలకడం ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె కోరారు.

Anitha : జగన్ పరువు తీసిన హోమ్ మంత్రి.. లేని జనాల్ని చూపించటానికి బంగారుపాళ్యం విజువల్స్ వాడారని విమర్శలు..!
Anitha : అస్సలు లేని జనాల్ని చూపించటానికి బంగారుపాళ్యం విజువల్స్ ను వాడుకున్న జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోర్టులు తప్పుపట్టాయని, సభ్య సమాజం చీకొడుతుంటే జగన్ ఒక్కరే వారికి మద్దతిస్తున్నారని మంత్రి అనిత ఆరోపించారు. రాజకీయంగా ప్రశాంతిరెడ్డిని ఎదుర్కోలేక చవకబారు వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డిని జగన్ పరామర్శించడం సిగ్గుచేటని అన్నారు. ఆస్తి పంపకాల విషయంలో తల్లీచెల్లిపై కోర్టులో గెలిచానని వీరంగం చేసే వ్యక్తిని జగన్లోనే చూశానని ఆమె వ్యంగ్యంగా అన్నారు. జగన్ చేసేది పరామర్శలా లేక బల ప్రదర్శనలా అని ప్రశ్నిస్తూ, పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు చేస్తే పోలీసులు అనుమతులు ఇవ్వాలా అని నిలదీశారు.
జగన్ నెల్లూరు పర్యటనలో సాక్షి టీవీలో ‘ఫేక్ విజువల్స్’ ప్రసారం చేశారని మంత్రి అనిత తీవ్ర ఆరోపణలు చేశారు. లేని జనాల్ని చూపించడానికి బంగారుపాళ్యం విజువల్స్‌ను నెల్లూరు పర్యటనగా చూపించారని ఆమె పేర్కొన్నారు. విశ్వసనీయత, పత్రికా విలువల గురించి గొప్పగా లెక్చర్లు ఇచ్చిన భారతీరెడ్డి ఈ ఫేక్ వీడియోలపై ఏం సమాధానం చెప్తారని మంత్రి అనిత ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త వివాదానికి దారితీసే అవకాశం ఉంది.
జగన్ నెల్లూరు టూర్ లో బంగారుపాళ్యం వీడియో..
ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించిన అనిత..
జనాలు రాకపోతే పాత వీడియోలు మిక్స్ చేసి ఎవరిని మోసం చేస్తారు..?
ఇదే నా జగన్ చెప్పే విశ్వసనీయత..?
– హోం మంత్రి అనిత pic.twitter.com/if7tbDL7Ft
— BIG TV Breaking News (@bigtvtelugu) July 31, 2025