TDP : టీడీపీ సీటు బాగా కాస్ట్‌లీ.. కోట్లు కుమ్మరిస్తేనే టికెట్.. ఈసారి చంద్రబాబు స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TDP : టీడీపీ సీటు బాగా కాస్ట్‌లీ.. కోట్లు కుమ్మరిస్తేనే టికెట్.. ఈసారి చంద్రబాబు స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా?

TDP : ఏపీలో ఎన్నికలకు సమయం వచ్చేసింది. ఇంకా నాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ అయితే ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలన్న కసితో ఉంది. అధికార వైసీపీని ఢీకొట్టి గెలవాలంటే సరైన అభ్యర్థులు ఉండాలని, అలాగే.. ఈసారి ఖర్చు కూడా బాగానే పెట్టాల్సి వస్తుందని టీడీపీ భావిస్తోంది. అందులో భాగంగానే టీడీపీ అభ్యర్థుల ఎంపికను చంద్రబాబు ప్రారంభించారు. నిజానికి అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :22 December 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  50 కోట్లు ఖర్చు పెడితేనే టీడీపీ టికెట్

  •  పార్టీ నుంచి మరో 10 కోట్లు వస్తాయి

  •  ఈసారి అభ్యర్థుల ఎంపిక చాలా కాస్ట్ లీనే

TDP : ఏపీలో ఎన్నికలకు సమయం వచ్చేసింది. ఇంకా నాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ అయితే ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలన్న కసితో ఉంది. అధికార వైసీపీని ఢీకొట్టి గెలవాలంటే సరైన అభ్యర్థులు ఉండాలని, అలాగే.. ఈసారి ఖర్చు కూడా బాగానే పెట్టాల్సి వస్తుందని టీడీపీ భావిస్తోంది. అందులో భాగంగానే టీడీపీ అభ్యర్థుల ఎంపికను చంద్రబాబు ప్రారంభించారు. నిజానికి అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. చాలా సమయం తీసుకొని మరీ ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తారు. అందుకే ఇతర పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించినా.. టీడీపీ అభ్యర్థుల ఎంపిక చాలా లేట్ అవుతుంది. ఎన్నికల ముందు హడావుడిగా అభ్యర్థులను చంద్రబాబు ప్రకటిస్తుంటారు.

అయితే.. ఈసారి టీడీపీ సీటుకు డిమాండ్ పెరిగిందనే అనుకోవాలి. ఎందుకంటే.. ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే చాలా కష్టపడాలి.. అలాగే వెనుక బ్యాక్ గ్రౌండ్ ఉండాలి.. ఆర్థికంగానూ స్థితిమంతుడై ఉండాలి. అటువంటి వాళ్లనే ఏరికోరి సెలెక్ట్ చేస్తున్నారు చంద్రబాబు. టికెట్ కావాలన చంద్రబాబు దగ్గరికి వెళ్తే వాళ్లకు ఉన్న ప్రజాబలం కంటే కూడా వాళ్ల వెనుక ఉన్న ఆర్థిక పరిస్థితిని టీడీపీ హైకమాండ్ అంచనా వేస్తోందట. ఎందుకంటే ఈసారి ఎంత ఎక్కువ ఖర్చు పెడితేనే గెలిచే చాన్స్ ఉంటుంది. ప్రజలకు నోట్ల కట్టలు విసిరి అయినా ఈసారి ఎన్నికల్లో గెలవాలనేది చంద్రబాబు ప్లాన్. 2019 ఎన్నికల్లో వైసీపీ అలాగే డబ్బులు వెదజల్లి అధికారంలోకి వచ్చిందని చెప్పుకుంటున్నారు. అందుకే ఈసారి మనం ఆ అస్త్రాన్ని ఎందుకు ప్రయోగించకూడదు అనే ధోరణిలో చంద్రబాబు అండ్ కో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే టికెట్ కోసం వచ్చే వాళ్లను ముందు ఎంత ఖర్చు పెడతావు అని నేరుగానే అడిగేస్తున్నారట.

TDP : ఒక్క నియోజకవర్గంలో 40 నుంచి 50 కోట్ల ఖర్చు

నిజానికి ఒక్క నియోజకవర్గంలో కనీసం 40 నుంచి 50 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. మరి.. అంత డబ్బు టీడీపీ పార్టీ నుంచే రావాలంటే కష్టం. అందుకే ఆమాత్రం అభ్యర్థులే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే 100 కోట్లు అయినా పెట్టడానికి రెడీగా ఉన్నారట. ఈనేపథ్యంలో టీడీపీ అభ్యర్థులు కనీసం 50 కోట్లు అయినా పెట్టడానికి సిద్ధంగా ఉండాలి కదా. అందుకే కనీసం అభ్యర్థులు 50 కోట్ల వరకు సెట్ చేసుకోగలిగితే.. పార్టీ నుంచి మరో 10 కోట్ల వరకు అయినా ఫండ్ అందనుంది. అంటే.. ఈసారి ప్రజాదరణ మాత్రమే కాదు.. ఆర్థికంగా బాగా సెటిల్ అయిన వాళ్లే టికెట్లను ఆశించాలన్నమాట.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది