Hyper Aadi : ఒసేయ్ డైమండ్ రాణి రోజా.. పవన్ కళ్యాణ్ ముందు నీ బతుకెంత తూ.. వెంట్రుక కూడా పీకలేవ్
Hyper Aadi : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అవడం ఏమో కానీ.. వైసీపీ నేతలు అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు ఒక్కడే కాదు.. ఇంకా చాలామంది అరెస్ట్ లు త్వరలోనే జరగనున్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏపీ మంత్రి రోజా అయితే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై విరుచుకుపడుతోంది. ఈనేపథ్యంలో రోజాకు హైపర్ ఆది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. సినిమా రంగంపై చాలామంది చులకనగా మాట్లాడుతున్నారు.. అంటూ హైపర్ ఆది మండిపడ్డారు. ఒక ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, మహేశ్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇలాంటి హీరోలను చూసి నేర్చుకోండి అంటూ హైపర్ ఆది చెప్పుకొచ్చారు.
సినిమా ఇండస్ట్రీలో ఉండి.. సినిమా ఇండస్ట్రీ ద్వారా లబ్ధి పొంది, ఇండస్ట్రీల వల్ల పాపులారిటీ సంపాదించి ఇప్పుడు కొందరు సినిమా ఇండస్ట్రీ గురించే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు హైపర్ ఆది. టాలెంట్ మనకు ఉంటే మనకంటూ ఒక రోజు వస్తుంది. సినిమా వాళ్ల నుంచి నేర్చుకునేది చాలా ఉంటుంది. కానీ.. సినిమా వాళ్లను మాత్రం కించపరచకండి.. అంటూ హైపర్ ఆది వేడుకున్నారు. మీమర్స్, ట్రోలర్స్, పబ్లిక్ ఒపినియన్స్ చెప్పేవాళ్లు, రివ్యూ చెప్పే వాళ్లు అందరూ సినిమా ఇండస్ట్రీలో భాగమే అన్నారు హైపర్ ఆది. కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకల్లోనే హైపర్ ఆది పై వ్యాఖ్యలు చేశారు.
Hyper Aadi : పవన్ కళ్యాణ్ ను ఆకాశానికెత్తిన హైపర్ ఆది
ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ఆది చెప్పుకొచ్చారు. ఒక పక్క 10 మంది పేద వాళ్లను నిలుచోబెట్టి, మరో పక్క వంద కోట్లు పెట్టి వాళ్ల ఆకలి తీరుస్తావా? లేక నీ ఆకలి తీర్చుకుంటావా? అని అడిగితే ఆ వంద కోట్లు 10 మందికి పంచి వాళ్ల ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే అంటారు పవన్ కళ్యాణ్. ఆయన్ను చూసి నేర్చుకోండి. సంపాదించడమే కాదు.. సాయం చేయడం కూడా ముఖ్యమని.. అంటూ రోజాను ఉద్దేశించి హైపర్ ఆది వ్యాఖ్యానించారు.