Pawan kalyan : ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతా దమ్ముంటే.. ఆపుకో జగన్ పవన్ సంచలన సవాల్ వీడియో వైరల్..!!
Pawan kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర తొలి బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. కత్తిపూడి లో జరిగిన తొలి బహిరంగ సభలో వైసీపీ పార్టీని మరియు అధ్యక్షుడు వైఎస్ జగన్ ని టార్గెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. ఇదే సమయంలో 2019 ఎన్నికలలో తనని టార్గెట్ చేసి రెండు చోట్ల ఓడించేలా చేశారని అన్నారు. భీమవరం నియోజకవర్గంలో మొత్తం లక్ష ఓట్లు ఉంటే అక్కడ లక్ష 8 వేల ఓట్లు పోలైన పరిస్థితి నెలకొంది. ఆ విధంగా నన్ను టార్గెట్ చేసి.. అసెంబ్లీలో అడుగుపెట్టకుండా కావాలని ఓడించారు.
కానీ ఈసారి జరగబోయే ఎన్నికలలో.. కచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతా. ఎవడు ఆపుతాడో నేను చూస్తా.. అంటూ సవాల్ విసిరారు. ఇదే సమయంలో అసెంబ్లీలో అడుగు పెట్టకుండా దమ్ముంటే అడ్డుకోవాలనీ సీఎం జగన్ కి పవన్ కళ్యాణ్ సవాల్ విసిరడం జరిగింది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో ఎవరు ఎన్ని కుట్రలు పడినా జనసేన విజయ డంకా మోగించడం గ్యారెంటీ అని తాను అసెంబ్లీలో పోరాడుతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏమి అధికారం ఇవ్వకపోయినా ప్రజల కోసం ఈ రీతిగా పోరాడుతుంటే వచ్చే ఎన్నికలలో ప్రజలు ఆదరిస్తే మరింతగా…
ప్రజల కోసం నిలబడటానికి సిద్ధంగా ఉన్నట్లు కత్తిపూడి సభలో స్పష్టం చేయడం జరిగింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గోదావరి జిల్లాల ప్రజల చేతిలో ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో రెండు గోదావరి జిల్లాల ప్రజలు జనసేన పార్టీని ఆదరించి.. గెలిపించాలని సూచించారు.
