
YCP : సాధారణంగా ఎన్నికలు జరిగిన తర్వాత రాజకీయ పార్టీలు చేసేటువంటి ప్రకటనలు , ప్రవర్తించే తీరు విధానం చూస్తే రాబోయే ఎన్నికల్లో వారి పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అయితే గత ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీ నిస్సహాయతను వ్యక్తం చేస్తూ వచ్చింది. అంతేకాక ఎన్నికల్లో చాలా చోట్ల వైసీపీ పార్టీ రిగ్గింగ్ కు పాల్పడినట్లు ఆరోపించింది. అనంతరం ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. అదే సమయంలో వైసీపీ ఘన విజయం సాధించి విజయకేతనం ఎగురవేసింది. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ పార్టీ కూడా ఇదే తరహా ప్రకటనలు చేస్తూ రావడం గమనార్హం. ఎందుకంటే అధికార పార్టీ వైసీపీ ఇప్పుడు టీడీపీ పార్టీని ఉద్దేశిస్తూ అధిక మొత్తంలో రిగ్గింగ్స్ కు పాల్పడినట్లుగా ఆరోపిస్తోంది. దీంతో గత ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఎదురైన పరిస్థితులు ఇప్పుడు వైసీపీ పార్టీకి ఎదురుకానున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటమి పాలవుతుందనే ఆలోచనతోనే వైసీపీ పార్టీ ఈ తరహాలో ఆరోపణలు చేస్తుందని విపక్ష పార్టీలు చెప్పుకొస్తున్నాయి. దీంతో ప్రస్తుతం వైసీపీ పార్టీ తన ఆత్మ రక్షణలో మునిగిపోయిందని చెప్పాలి.
ఈ నేపథ్యంలోనే ఓట్ల లెక్కింపు వరకు సొంత పార్టీ నాయకులను అలాగే అధికార యంత్రాంగాన్ని చెప్పు చేతల్లో పెట్టుకునెందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని నమ్మకాన్ని అందరిలో కలిగించేలా చేస్తుందని చెప్పవచ్చు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా వైసీపీ పార్టీ విపరీతమైన ప్రచారాలు కొనసాగిస్తుంది.. దీంతో ఒకవేళ వైసీపీ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆంధ్ర ప్రజలు వైసిపి పార్టీపై విశ్వాసం కోల్పోయారనే ,మ్ప్రచారాలు చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికే గ్రామస్థాయిలో వాలంటీర్లు అందరూ వాట్సప్ గ్రూపులలో పలు రకాల కామెంట్స్ చేస్తూ వస్తున్నారట. వైసీపీ పార్టీ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను తీసుకునే వారు విశ్వాసం చూపించడానికి ఇదే సరైన సమయం అని , కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీని ఆశీర్వదించి ఓటు వేయాలని కోరుతూ వాట్సాప్ గ్రూప్ లో టాక్ నడిచింది.
ఈ క్రమంలోనే ప్రభుత్వ పథకాలు తీసుకున్నవారు కృతజ్ఞతతో ఓటు వేస్తారని కృతజ్ఞత లేని వారు విపక్షాలకు ఓటు వేస్తారంటూ వైసీపీ నేతలు సైతం పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. ఈ విధంగా చూసుకుంటే ఈ ఏడాది ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైనట్లయితే ప్రజలకు విశ్వాసం లేదు అన్న మాటను బలంగా వినిపించేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది.తద్వారా కొంతమేరకైనా వైసీపీ పార్టీకి సింపతి దక్కుతుందని ఆలోచనలో ఉంది. అంతేకాక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజల్లో కాస్త వ్యతిరేకత కనిపించింది. అయినప్పటికీ వైసీపీ అధినేత వైయస్ జగన్ మాత్రం గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ చెప్పడం రాజకీయ ఎత్తుగడలలో భాగమేనని పలువురు అంటున్నారు. ఒకవేళ ఎన్నికల్లో ఓటమిపాలైతే దానికి గల కారణం ప్రజలు అంటూ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో విజయం దక్కించినప్పుడు ప్రజల విశ్వాసం వలన గెలిచామని చెప్పిన వైసీపీ శ్రేణులు ఓటమిపాలైతే మాత్రం విశ్వాసం లేని ప్రజలు అనే మాటను గట్టిగా వినిపించడం అనేది సరైన పద్ధతి కాదంటూ పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.