Ysrcp : ఇటు కూటమిలో.. అటు వైసీపీలో.. అభ్యర్థుల మార్పుకు రెడీ..!
Ysrcp : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దాంతో అన్ని పార్టీలు ఇప్పుడు ఎలాగైనా గెలిచేందుకు చాలా రకాల సన్నాహాలు చేస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్టే ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇటు జగన్ ను ఢీ కొట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఒక్కటైపోయాయి. అటు కాంగ్రెస్ పార్టీ కూడా వామపక్షాలతో పొత్తులు పెట్టుకుంది. దాంతో ఇప్పుడు పోటీ మరీ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు దాదాపుగా అభ్యర్థులను ప్రకటించాయి. అన్ని పార్టీలు ప్రచారాలు చేస్తూ దూసుకుపోతున్నాయి. అటు ఇప్పుడు కూటమిలో కొంతమంది అభ్యర్థులపై పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తుంది.ఆయా నియోజకవర్గాల్లో ఉండే స్థానిక నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులను మార్చుతారని తెలుస్తోంది.
ఇందులో ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి, అనంత జిల్లాలో మార్పులు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటికే మార్చాలనుకునే నియోజకవర్గాల లిస్టు కూడా రెడీ చేయించారంట. అంతే కాకుండా అక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై ఐవీఆర్ ఎస్ సర్వేలు కూడా చేయిస్తున్నారు. ముందుగా నియోజకవర్గం నేతలతో మాట్లాడిన తర్వాత అభ్యర్థుల మార్పు ఉంటుందని తెలుస్తోంది.
ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారంట చంద్రబాబు, పవన్ కల్యాణ్. అటు జగన్ ఇప్పటికే అందరు అభ్యర్థులను మార్చేశారు. వైసీపీలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులపై అసంతృప్తులు బయట పడుతున్నాయని తెలుస్తోంది. దాంతో పాటు ఇప్పుడు కూటమి అభ్యర్థులను మారిస్తే కచ్చితంగా జగన్ కూడా కొన్ని చోట్ల మార్పులు చేస్తారని అంటున్నారు. 80 మంది సెట్టింగ్ స్థానాల్లో మార్పులు చేశారు. ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులపై ఎప్పటికప్పుడు సర్వేలు బయటకు తీస్తున్నారు. అటు ప్రతిపక్ష కూటమి అభ్యర్థుల బలాబాలపై కూడా ఆరాలు తీస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మూడు స్థానాల్లో మార్పులు ఉంటాయని పార్టీలో చర్చ జరుగుతుంది. ఒక ఎంపీ అభ్యర్థిని సైతం మారుస్తారని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థులను మారిస్తే కచ్చితంగా వైసీపీలో మార్పులు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.