Rohit Sharma : ఐపీఎల్ సీజన్ 17లో ముంబై ఇండియన్స్ జట్టు కొత్త కెప్టెన్ నాయకత్వంలో బరిలోకి దిగుతుంది. గుజరాత్ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యాని తీసుకొచ్చి ముంబై కెప్టెన్ చేయడంతో రోహిత్ అభిమానులు చాలా గుర్రుగా ఉన్నారు. ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్‌ని కెప్టెన్సీ నుండి తప్పించి హార్ధిక్‌ని కెప్టెన్ చేయడమేంటనే నిరసనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ నిరసనల మధ్యే ముంబై ఇండియన్స్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడింది. మూడు మ్యాచ్‌లలోను దారుణమైన పరాజయాలు చవి చూసింది. గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల చేతుల్లో ముంబై దారుణంగా ఓడిపోయింది.
మూడు పరాజయాల పట్ల రోహిత్ శర్మ ఒకింత అసహనంతో ఉన్నట్టు సమాచారం. ఇన్నాళ్లు ఆ జట్టు కోసం చాలా కష్టపడ్డ రోహిత్ శర్మ ఇప్పుడు ఆ జట్టుతో ఆడలేక చాలా ఇబ్బందులు పడుతున్నాడట. ఈ సీజన్ తర్వాత రోహిత్ ముంబైని విడిచిపెడతాడని న్యూస్ 24 ఓ కథనంలో రాసుకొచ్చింది. ఒక్క రోహిత్ శర్మనే కాదు ఆయనతో పాటు సీనియర్ ప్లేయర్లు జస్ ప్రీత్ బుమ్రా, మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ సూర్య కుమార్ యాదమ్ ముంబైను వీడే యోచనలో ఉన్నారని న్యూస్ 24 తెలిపింది. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే ముంబై భారీ మూల్యం చెల్లించుకున్నట్టే అని అంటున్నారు. ఇక రోహిత్ నాయకత్వంలో ముంబైని ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా మార్చాడు. హార్ధిక్ మాత్రం తమ జట్టుని ప్లే ఆఫ్స్‌కి కూడా చేరకుండా చూస్తున్నట్టుగా అర్ధమవుతుంది.
రోహిత్‌కు క్రికెట్, కెప్టెన్సీలో మంచి అనుభవం ఉంది.అయితే హార్ధిక్‌కి ఆ అనుభవం కొరవడింది. దీంతో ముంబై యాజమాన్యం కూడా ఓ సంచలన నిర్ణయం తీసుకోనుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. న్యూస్ 24 కథనం ప్రకారం, రోహిత్‌ను మళ్లీ కెప్టెన్‌గా చేయడానికి ముంబై యాజమాన్యం ప్రయత్నిస్తుందని టాక్. అయితే అంతకముందు కెప్టెన్ హార్దిక్ తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికి 2 మ్యాచ్‌ల అవకాశం ఇవ్వవచ్చు. ఈ రెండు మ్యాచుల్లో ముంబైను గెలిపించడంతో పాటు ప్లేయర్ గానూ వ్యక్తిగతంగా రాణిస్తే ఎలాంటి సమస్య ఉండదు. లేదంటే మాత్రం ముంబై కెప్టెన్సీ బాధ్యతలని రోహిత్‌కి లేదంటే వేరే సీనియర్ ఆటగాళ్లకి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. చూడాలి మరి రానున్న రోజులలో ఏం జరుగుతుందనేది…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.