YSRCP and TDP : అలుగుతున్నారు.. వెళ్ళిపోతున్నారు.. రెండు పార్టీలలో ఇదే పరిస్థితి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YSRCP and TDP : అలుగుతున్నారు.. వెళ్ళిపోతున్నారు.. రెండు పార్టీలలో ఇదే పరిస్థితి..!

 Authored By anusha | The Telugu News | Updated on :10 January 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  YSR and TDP : అలుగుతున్నారు.. వెళ్ళిపోతున్నారు.. రెండు పార్టీలలో ఇదే పరిస్థితి..!

YSRCP and TDP  : వైయస్సార్ సీపీ పార్టీ, టీడీపీ పార్టీ నాయకత్వాలకు చిన్నాచితక తలనొప్పులు తగ్గటం లేదు. కొందరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని నాయకత్వాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లను మారుస్తూ పోతున్నారు. అంతేకాదు అసెంబ్లీ లోక్ సభ వర్గాల అభ్యర్థులను అటు ఇటు మారుస్తున్నారు. ఇలా మార్చడానికి ఆయన కొన్ని సర్వేల ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటితో పాటే సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంటున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బడుగు, బలహీన వర్గాలకు ఎక్కువ స్థానాలు కట్టబట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో సహజంగానే కొన్నిచోట్ల టికెట్ ఆశించని నేతలు అసంతృప్తికి గురవుతున్నారు. వారిలో కొందరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.

ఇలా గుడ్ బై చెప్పిన వారిని తమ పార్టీలో చేర్చుకోవడానికి టీడీపీ నాయకుడు చంద్రబాబునాయుడు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఉత్తరాంధ్రలో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కొన్ని రోజుల క్రితం తన కుమారుడు, అనుచరులతో కలిసి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆ మరునాడు చంద్రబాబు దగ్గరికి వెళ్లి పచ్చ కండువా కప్పుకున్నారు. అలాగే రాయలసీమకు చెందిన మాజీ ఎంపీ రామచంద్రయ్య కూడా వైయస్సార్ కాంగ్రెస్ ను వీడి టీడీపీలోకి చేరారు. గతంలో చంద్రబాబు నాయుడు వైఖరిని చీల్చి చెండాడిన వీరిద్దరూ ఇప్పుడు చిరునవ్వు చెదరకుండా చంద్రబాబు పార్టీలోకి చేరారు. దాడి వీరభద్ర రావు చేరికతో అనకాపల్లిలో పార్టీ బలం చేకూరితుందని చంద్రబాబు ఆలోచన.

రామచంద్రయ్య రాకతో సీమలో ఓటు బ్యాంకు తమకి దక్కుతుందని చంద్రబాబు నాయుడు లెక్క. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన అంబటి రాయుడు అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన గుంటూరు లోక్ సభ స్థానాన్ని ఆశించారు. జగన్ ఇవ్వకపోవడంతో రాయుడు పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ట్వీట్ చేశారు. కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ఆయన మరో పార్టీలో చేరతారా లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అనేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే అంబటి రాయుడు కి గ్రామీణ ప్రజల్లో అంత జనాదరణ లేదు. పట్టణ ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులకు మాత్రమే రాయుడు తెలుసు. మిగతా వారికి ఆయన ఎవరో కూడా తెలియదు. దీనివలన రాయుడు వైసీపీ నుంచి వెళ్ళటం వలన పెద్దగా నష్టం ఉండదని అంటున్నారు.

ఇక టీడీపీలో కూడా అలాంటివే జరుగుతున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నానిని పక్కనపెట్టి ఆయన తమ్ముడు కేశినేని చిన్నిని ప్రోత్సహించడంతో నాని అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు నాయుడు తనను వాడుకొని వదిలేసారని భావిస్తున్న నాని త్వరలోనే తాను గెలుపు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. టీడీపీకి ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. కేశినేని నాని పార్టీని వీడితే ఆయన ఒక్కరే పోరు. ఆయనతోపాటు సన్నిహితంగా ఉండే వారంతా ఎమ్మెల్యేలు, అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీని వీడుతారు. ఇక ఎన్టీఆర్ జిల్లాకు చెందిన దేవినేని ఉమా పరిస్థితి కూడా సంకటంగానే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ప్లేస్ లో కొత్త అభ్యర్థిని తీసుకురావాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. ఎన్నికల దగ్గరయ్యే కొద్ది ఇలా రెండు పార్టీలలోను రాజీనామాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది