YS Jagan : ఈ రోజు జగన్ చేసిన పని – చరిత్రలో మిగిలిపోతుంది.. దేశం మొత్తం సెల్యూట్ కొడుతోంది !
YS Jagan : ఏపీ వ్యాప్తంగా జూన్ 12 న అంటే ఇవాళ పాఠశాలలు అన్నీ తెరుచుకున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థులు అందరికీ ఏపీ ప్రభుత్వం తరుపున కానుక ఇవ్వాలని భావించి.. 43 లక్షల మంది విద్యార్థులను జగనన్న విద్యా కానుకను అందించారు. ఈ సంవత్సరం జగనన్న విద్యా కానుక కోసం ప్రభుత్వం రూ.1100 కోట్లు ఖర్చు చేస్తోంది. జగనన్న విద్యా కానుకలో భాగంగా.. యూనిఫామ్, షూ, రెండు జతల సాక్సులు, బెల్ట్, బ్యాగ్ ఇస్తున్నారు.
అలాగే.. ఇంగ్లీష్, తెలుగు పుస్తకాలు, ఇతర సబ్జెక్టుల పుస్తకాలు, వర్క్ బుక్స్, డిక్షనరీ, నోటు పుస్తకాలను కూడా ఉచితంగా అందిస్తున్నారు. సీఎం జగన్ పల్నాడు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని స్కూల్స్ ప్రారంభం రోజునే ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజాప్రతినిధులు ఆ నియోజకవర్గంలో ఉన్న స్కూళ్ల విద్యార్థులకు జగనన్న విద్యా కానుకను అందించారు.ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో చదివి పది, ఇంటర్ పరీక్షల్లో టాప్ లో నిలిచిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు స్కీమ్ ను సీఎం జగన్ 20న ప్రారంభించనున్నారు. ఆయా స్కూళ్ల ఉపాధ్యాయులను, టాప్ లో నిలిచిన విద్యార్థుల పేరెంట్స్ ను కూడా సత్కరించనున్నారు.
YS Jagan : ప్రభుత్వ విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు స్కీమ్
ఇలా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ మెరుగైన మార్కులు సాధించే ప్రతి విద్యార్థికి ఏపీ ప్రభుత్వం ద్వారా ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరేలా సీఎం జగన్ రూపకల్పన చేశారు. చదువుల్లో చురుకుగా ఉండే పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే ఏపీ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. అలాగే.. టెన్త్, ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు రాయకున్నా కూడా కాలేజీలకు వెళ్లి చదువుకునే అవకాశాన్ని సీఎం జగన్ కల్పించారు.