TDP : ఈ ట్విస్ట్ మాములుగా లేదు.. జనసేనకి ఝలక్ ఇచ్చి టీడీపీలోకి జంప్..!
TDP : ఏపీలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతారో చెప్పడం కాస్త కష్టంగానే మారింది.అయితే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ దంపతులు మూడు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పారు. పద్మశ్రీ వైఎస్సార్‌సీపీకి .. ఆమె భర్త ప్రసాదరావు పార్టీకి, బీసీ సెల్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తాము వ్యక్తిగత కారణాలతో […]
ప్రధానాంశాలు:
TDP : ఈ ట్విస్ట్ మాములుగా లేదు.. జనసేనకి ఝలక్ ఇచ్చి టీడీపీలోకి జంప్..!
TDP : ఏపీలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతారో చెప్పడం కాస్త కష్టంగానే మారింది.అయితే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ దంపతులు మూడు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పారు. పద్మశ్రీ వైఎస్సార్‌సీపీకి .. ఆమె భర్త ప్రసాదరావు పార్టీకి, బీసీ సెల్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తాము వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు.
TDP ఊహించని ట్విస్ట్..
అయితే మళ్లీ ఏమైందో ఏమోకానీ జనసేన పార్టీకి ట్విస్ట్ ఇస్తూ.. కొన్ని గంటల్లోనే దంపతులు యూటర్న్ తీసుకున్నారు. జెడ్పీ ఛైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ భర్త ప్రసాదరావు.. విశాఖపట్నంలో తెలుగు దేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను కలిశారు. ఆయన సమక్షంలో ఘంటా ప్రసాదరావు తెలుగు దేశం పార్టీలో చేరారు.. ఆయనకు పల్లా శ్రీనివాస్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జెడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ త్వరలో నారా లోకేష్ సమక్షంలో టీడీపీ చేరబోతున్నట్లు తెలుస్తోంది.పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆయన పార్టీలో చేరడం ద్వారా జిల్లా పరిషత్తును అభివృద్ధి చేసుకుని ప్రజలకు సేవ చేయాలన్నదే తమ ఉద్దేశ్యమని చెప్పారు.
మరి పవన్ పంచాయతీ రాజ్ ని పక్కన పెట్టేసి పసుపు పార్టీలో చేరడం పట్ల చర్చ సాగుతోంది. కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలో ఒక పార్టీలో చేరాల్సిన డెసిషన్ ని వేరొక పార్టీ వైపు ఎందుకు మార్చుకున్నారు అన్న దాని మీద చర్చ సాగుతోంది. ఇక ఏలూరు జిల్లాలో వైఎస్సారీసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. జనసేన పార్టీలో చేరతామని చెప్పిన ఘంటా దంపతులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.. మూడు రోజులకే యూటర్న్ తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఘంటా పద్మశ్రీ భర్త ప్రసాదరావు వెళ్లి తెలుగు దేశం పార్టీలో చేరారు. భర్త బాటలో భార్య పద్మశ్రీ కూడా నడవబోతోందని.. ఆమె కూడా త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది.