Arava Sridhar : అరవ శ్రీధర్‌ కారులోనే బలవంతం చేసాడు.. అతడి వల్ల ఐదుసార్లు అబార్షన్ అయ్యింది.. బాధిత మహిళ సంచలన వ్యాఖ్యలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Arava Sridhar : అరవ శ్రీధర్‌ కారులోనే బలవంతం చేసాడు.. అతడి వల్ల ఐదుసార్లు అబార్షన్ అయ్యింది.. బాధిత మహిళ సంచలన వ్యాఖ్యలు..!

 Authored By sudheer | The Telugu News | Updated on :28 January 2026,9:40 pm

ప్రధానాంశాలు:

  •  Arava Sridharఅరవ శ్రీధర్‌ కారులోనే బలవంతం చేసాడు.. అతడి వల్ల ఐదుసార్లు అబార్షన్ అయ్యింది.. బాధిత మహిళ సంచలన వ్యాఖ్యలు..!

  •  Arava Sridhar వల్ల పవన్ పరువు పోతుందా ?

Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై Arava Sridhar వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. బాధితురాలు మీడియా ముందుకు వచ్చి చేసిన వాదనలు వినిపించింది. 2024లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఎమ్మెల్యే, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏడాదిన్నర కాలంగా నరకం చూపించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కారులో తనపై బలవంతం చేయడమే కాకుండా, తనను ఐదుసార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించారని ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఎమ్మెల్యే ఒక శాడిస్ట్‌లా ప్రవర్తించేవారని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడం వల్లే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని ఆమె వివరించారు.

Arava Sridharఅరవ శ్రీధర్‌ కారులోనే బలవంతం చేసాడు అతడి వల్ల ఐదుసార్లు అబార్షన్ అయ్యింది బాధిత మహిళ సంచలన వ్యాఖ్యలు

Arava Sridharఅరవ శ్రీధర్‌ కారులోనే బలవంతం చేసాడు.. అతడి వల్ల ఐదుసార్లు అబార్షన్ అయ్యింది.. బాధిత మహిళ సంచలన వ్యాఖ్యలు..!

Arava Sridhar : వాడు ఎమ్మెల్యే కాదు శాడిస్ట్‌ – శ్రీధర్ పై బాధిత మహిళ సంచలన వ్యాఖ్యలు

ఈ తీవ్రమైన ఆరోపణలపై జనసేన పార్టీ అధిష్టానం తక్షణమే స్పందించింది. పార్టీ పరువుకు భంగం కలగకుండా ఉండటంతో పాటు, నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీలో టి. శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టి.సి. వరుణ్ సభ్యులుగా ఉన్నారు. అరవ శ్రీధర్ ఏడు రోజుల్లోపు కమిటీ ముందు హాజరై తన వివరణ ఇచ్చుకోవాలని పార్టీ స్పష్టం చేసింది. అంతవరకు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అయితే, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు. రివర్స్ అటాక్ చేస్తూ.. ఆ మహిళే తనను వేధిస్తోందని, రాజకీయంగా తనను దెబ్బతీయడానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొంటున్నారు.

వీణ Veena వర్సెస్ ఎమ్మెల్యే శ్రీధర్.. వీరిలో ఎవరు నిజం

ప్రస్తుతం ఈ కేసు పోలీసుల చేతుల్లో కంటే రాజకీయ రచ్చగా ఎక్కువగా కనిపిస్తోంది. బాధితురాలు తన దగ్గర అన్ని ఆధారాలు, వీడియోలు ఉన్నాయని, జనవరి 7 వరకు జరిగిన ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పిస్తానని చెబుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకుని ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయి. జనసేన కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాధితురాలు తనకు నష్టపరిహారం అవసరం లేదని, కేవలం చట్టప్రకారం శిక్ష పడాలని డిమాండ్ చేస్తుండటం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోంది. ఏది ఏమైనప్పటికి ఈ ఆరోపణల వల్ల పవన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అంత మాట్లాడుకుంటున్నారు. Arava Sridhar , Janasena MLA Arava Sridhar, Arava Sridhar controversy, Arava Sridhar harassment case , Victim woman allegations Arava Sridhar, Janasena MLA scandal, Andhra Pradesh political news, Arava Sridhar latest news, Janasena investigation committee , Veena vs Arava Sridhar , అరవ శ్రీధర్, అరవ శ్రీధర్ ఆరోపణలు, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అరవ శ్రీధర్ లైంగిక వేధింపులు, ఎమ్మెల్యే శ్రీధర్ కేసు, జనసేన ఎమ్మెల్యే స్కాండల్, అరవ శ్రీధర్ లేటెస్ట్ న్యూస్, జనసేన ఎమ్మెల్యే వివాదం, అరవ శ్రీధర్ వీణ కేసు, జనసేనకు షాక్ అరవ శ్రీధర్ కేసు, అరవ శ్రీధర్ సంచలన ఆరోపణలు

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి