Arava Sreedhar : డిల్లీ ని తాకిన జనసేన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం .. ఉగ్రూపంతో అమిత్ షా ఆదేశాలు
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక మహిళ చేసిన సంచలన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక మహిళ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు తనను శ్రీధర్ లైంగికంగా వేధించారని, మొదట ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై ఆ తర్వాత తనను లోబర్చుకున్నారని ఆమె పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, బలవంతంగా లోబర్చుకోవడమే కాకుండా, తాను గర్భవతి అయినప్పుడు తన ఇష్టానికి విరుద్ధంగా గర్భస్రావం చేయించారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. భర్తకు దూరంగా ఉంటున్న తనను విడాకులు తీసుకోవాలని ఆయన ఒత్తిడి తెచ్చినట్లు ఆమె తన ఆరోపణల్లో పేర్కొన్నారు.
Arava Sreedhar : డిల్లీ ని తాకిన జనసేన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం .. ఉగ్రూపంతో అమిత్ షా ఆదేశాలు
బెదిరింపులు మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆధారాలు
ఈ వివాదం కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాట్సాప్ చాట్లు మరియు వీడియోల కారణంగా మరింత ముదిరింది. తన డిమాండ్లకు ఒప్పుకోకపోతే మూడేళ్ల కుమారుడిని చంపేస్తానని ఎమ్మెల్యే తనను బెదిరించారని ఆ మహిళ ఆరోపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ అంశాన్ని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ అందిపుచ్చుకుంది. ఆ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోలను పోస్ట్ చేస్తూ, ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. అధికార పక్షంపై రాజకీయ విమర్శలు చేసేందుకు ఈ ఘటనను ఒక ప్రధాన అస్త్రంగా మార్చుకుంది.
సోషల్ మీడియాలో ఈ గొడవ ఇంతగా జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు పోలీసులకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదని సమాచారం. ఇటువంటి కేసుల్లో బాధితురాలు నేరుగా ఫిర్యాదు చేస్తే తప్ప పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కష్టమవుతుంది. ఒకవేళ ఫిర్యాదు నమోదైతే, ప్రాథమిక విచారణ అనంతరం ఎమ్మెల్యేపై లైంగిక వేధింపులు, బెదిరింపులు మరియు గర్భస్రావం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లేదా జనసేన పార్టీ వైపు నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు సవాలుగా మారింది. అంతే కాదు ఈ వ్యవహారం గురించి కేంద్ర బిజెపి నేతలు సైతం ఆరా తీస్తున్నట్లు వినికిడి. ప్రధాని మోడీ తో పాటు కేంద్ర పెద్దలతో పవన్ కళ్యాణ్ చాల సన్నిహితంగా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యే నీచానికి పాల్పడ్డారనే వార్తలు పవన్ కళ్యాణ్ ను తలదించుకునేలా చేసింది. మరి దీనిపై ఏంజరుగుతుందో..? పవన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.