
janasena tdp alliance Again
Ysrcp : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి హావ రోజు రోజుకు పెరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ తీరుస్తూ, అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తూ ప్రజల మెప్పు పొందుతున్నాడు. జగన్ పాలనా బాగుండడం తో ప్రజలు ఆయనకే పట్టం కడుతున్నారు. శాసన ఎన్నికల్లోనేకాదు , మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ ఓటర్లు వైసీపీ కి ఎక్కువ స్థానాలు ఇచ్చారు.
ఇక త్వరలో మున్సీపాలటీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లోనూ అధికార పార్టీ విజయం సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. అయితే ఎలాగైనా వైసీపీ పార్టీ ని ఓడించాలని కంకణం కట్టుకున్న తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీలు..ఇప్పుడు కలిసి పనిచేస్తూ జగన్ ఓటమిని కోరుకుంటున్నారు.
janasena tdp alliance Again
అందుకే జనసేన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తెలుగుదేశం నేతలు , కార్య కర్తలు తెగ కష్టపడుతూ ప్రచారం చేస్తున్నారు. విజయవాడ, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ కీలక నేతలైన వంగవీటి రాధా, చింతమనేని ప్రభాకర్ ప్రచారం చేపట్టడం అందర్నీ షాక్ కు గురి చేస్తున్నాయి. విజయవాడ రామలింగేశ్వర నగర్ వార్డు జనసేన అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో వంగవీటి రాధా పాల్గొన్నారు. ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
కాకపోతే టీడీపీ అభ్యర్థులు లేని డివిజన్‌లలో మాత్రమే జనసేన కోసం వీరు ప్రచారం చేస్తూ వైసీపీ పార్టీ అభ్యర్థుల ఓటమిని కోరుతున్నారు. రీసెంట్ గా రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను , వైసీపీ నేతలు బెదిరించడం , కొట్టడం వంటివి చేయడం తో ఈసారి చాలామంది టీడీపీ కార్య కర్తలు పోటీ చేసేందుకు వెనకడుగు వేశారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అభ్యర్థుల కోసం తెలుగుదేశం పార్టీ నేతలు , కార్య కర్తలు ప్రచారం చేస్తున్నారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.