JC Prabhakar Reddy : బీ కేర్ ఫుల్.. నీ ఆఫీస్‌కు వచ్చి కొడతా అంటూ పంచాయతీ ఆఫీసర్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్..!
JC Prabhakar Reddy : అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజనాయుడిపై ఆయన తీవ్రంగా దుర్భాషలాడారు. చెప్పిన పనులు చేయకపోతే చూస్తూ ఊరుకోదని, ఆఫీస్‌కి వచ్చి కొడతానని బెదిరించాడు. జేసీ ప్రవర్తనతో భయభ్రాంతులకు గురైన డీపీఓ నాగరాజనాయుడు ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో చోటుచేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది.
JC Prabhakar Reddy : బీ కేర్ ఫుల్.. నీ ఆఫీస్‌కు వచ్చి కొడతా అంటూ పంచాయతీ ఆఫీసర్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్..!
తాడిపత్రిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అధికారులు సమర్థవంతంగా స్పందించలేదన్న అభిప్రాయంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓ ప్రజాప్రతినిధి అధికారిని బెదిరించడం అభ్యంతరకరమని స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతోంది. జేసీ చెప్పిన విధంగా “రేపు ఆఫీస్‌కు వచ్చి కొడతా” అంటూ నేరుగా బెదిరింపులు చేయడం పట్ల అధికారులు, ఉద్యోగ సంఘాలు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ఘటనపై సంబంధిత అధికారుల నుండి వివరాలను సేకరించి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీలోని ఇతర నేతలు ఎలా స్వీకరిస్తారన్నదానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రజా ప్రతినిధులు ప్రజల పక్షాన మాట్లాడటం సబబే అయినా, వ్యక్తిగత స్థాయిలో బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చే చర్యగా భావిస్తున్నారు.
Kavitha : తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన తాజా…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టే వస్తువులు అయినా,దేవుని విగ్రహాలైనా సరే వీటి విషయంలో చాలా…
Tripathi : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నల్గొండ జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అధికారులు,సిబ్బంది ఎలాంటి విమర్శలు,ఆరోపణలకు…
Vajresh Yadav : ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర…
Venkatesh : టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ కోసం మరో వినోదభరితమైన సినిమా కథ సిద్ధమవుతోంది. ఇప్పటికే హ్యూమర్‌కి సిగ్నేచర్…
Chandrababu : రాయలసీమలో సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు చరిత్రాత్మకంగా నిలుస్తాయని నంద్యాల…
Samsung Galaxy S24 FE : ఫ్లిప్‌కార్ట్ లో జరుగుతున్న GOAT Sale జులై 17కి ముగియబోతోంది . ఈ…
Jabardast Naresh : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో “జబర్దస్త్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం…
This website uses cookies.