JC Prabhakar Reddy : బీ కేర్ ఫుల్.. నీ ఆఫీస్‌కు వచ్చి కొడతా అంటూ పంచాయతీ ఆఫీసర్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్.. వీడియో !
ప్రధానాంశాలు:
తాడిపత్రి లో బెదిరింపులకు దిగిన జేసీ
JC Prabhakar Reddy : బీ కేర్ ఫుల్.. నీ ఆఫీస్‌కు వచ్చి కొడతా అంటూ పంచాయతీ ఆఫీసర్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్.. వీడియో !
JC Prabhakar Reddy : అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజనాయుడిపై ఆయన తీవ్రంగా దుర్భాషలాడారు. చెప్పిన పనులు చేయకపోతే చూస్తూ ఊరుకోదని, ఆఫీస్‌కి వచ్చి కొడతానని బెదిరించాడు. జేసీ ప్రవర్తనతో భయభ్రాంతులకు గురైన డీపీఓ నాగరాజనాయుడు ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో చోటుచేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది.

JC Prabhakar Reddy : బీ కేర్ ఫుల్.. నీ ఆఫీస్‌కు వచ్చి కొడతా అంటూ పంచాయతీ ఆఫీసర్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్..!
JC Prabhakar Reddy పంచాయతీ ఆఫీసర్ ను బెదిరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అధికారులు సమర్థవంతంగా స్పందించలేదన్న అభిప్రాయంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓ ప్రజాప్రతినిధి అధికారిని బెదిరించడం అభ్యంతరకరమని స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతోంది. జేసీ చెప్పిన విధంగా “రేపు ఆఫీస్‌కు వచ్చి కొడతా” అంటూ నేరుగా బెదిరింపులు చేయడం పట్ల అధికారులు, ఉద్యోగ సంఘాలు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ఘటనపై సంబంధిత అధికారుల నుండి వివరాలను సేకరించి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీలోని ఇతర నేతలు ఎలా స్వీకరిస్తారన్నదానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రజా ప్రతినిధులు ప్రజల పక్షాన మాట్లాడటం సబబే అయినా, వ్యక్తిగత స్థాయిలో బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చే చర్యగా భావిస్తున్నారు.
బీ కేర్ ఫుల్.. రేపు మీ ఆఫీస్‌కు వచ్చి కొడతా
అనంతపురం జిల్లా తాడిపత్రి @JaiTDP నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులు
జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజనాయుడు పై దుర్భాషలాడిన జేసీ
చెప్పిన పనులు చేయకపోతే అంతు చూస్తానని బెదిరింపులు
జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు ఆఫీస్… pic.twitter.com/VHXaGsMQ5H
— Telugu Feed (@Telugufeedsite) July 17, 2025