
Chandrababu : బెదిరిస్తే పారిపోయే వ్యక్తిని కాను అంటూ సీఎం చంద్రబాబు హెచ్చరిక..!
Chandrababu : రాయలసీమలో సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు చరిత్రాత్మకంగా నిలుస్తాయని నంద్యాల పర్యటనలో స్పష్టం చేశారు. జూలై 17 తేదీని రాయలసీమ చరిత్రలో ఒక శుభదినంగా పేర్కొన్న సీఎం, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తాను, ఇలాంటి రోజు రావడం గర్వంగా ఉందన్నారు. రాయలసీమలో వర్షాభావం, నీటి కొరత వల్ల రైతులు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేస్తూ, గతంలో వేరుశనగ పంటలు ఎండిపోవడంతో ఇన్‌పుట్ సబ్సిడీ అందించామన్నారు. పశువులకు గడ్డి లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి రైతుల్ని ఆదుకున్న ఘటనలను గుర్తు చేశారు.
Chandrababu : బెదిరిస్తే పారిపోయే వ్యక్తిని కాను అంటూ సీఎం చంద్రబాబు హెచ్చరిక..!
పౌరాణిక చరిత్రలోను, సమకాలీన పాలనలోను రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన మొట్టమొదటి నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడిన చంద్రబాబు, ఆయన కలలను సాకారం చేసేది తానేనన్నారు. హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2200 క్యూసెక్కుల నుంచి 3850 క్యూసెక్కుల వరకు పెంచిన తీరును వివరించారు. ఈ విస్తరణతో రాయలసీమ రైతులకు భారీగా మేలు జరుగుతుందని తెలిపారు. మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటిని విడుదల చేసిన ఘట్టాన్ని ఎంతో ఉద్వేగంతో వివరించిన సీఎం, ఈ రికార్డు స్థాయి పనుల్లో భాగస్వాములైన ఇంజినీర్లు, అధికారులు, కార్మికులందరికీ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఫేజ్ 2 పనులను వేగంగా పూర్తిచేసి, నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నీళ్లిస్తే రైతులు బంగారం పండిస్తారన్న నినాదంతో, ప్రతి ఎకరాకు నీరు అందించాలన్న సంకల్పాన్ని స్పష్టం చేశారు. రైతుల జీవితాల్లో స్థిరత్వం, అభివృద్ధి తీసుకురావడమే తన ధ్యేయమని తెలిపారు. కేంద్రం సమక్షంలో జరిగిన జలశక్తి భేటీలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి పాటిస్తామని, నదుల అనుసంధానానికి ప్రధాని మోదీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు.
Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…
YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…
Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
Kushi Movie Sequel : పవన్ కళ్యాణ్ Pawan Kalyan కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచిన ఖుషి…
Gold and Silver Price 13 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి, పసిడి…
Karthika Deepam 2 March 13th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న అత్యంత ప్రజాదరణ…
This website uses cookies.