Home » Andhra Pradesh » Journalist Krishnam Raju Make Another Mistake
andhra pradesh

Journalist Krishnam Raju : జర్నలిస్ట్ కృష్ణంరాజు తప్పు మీద తప్పు చేస్తున్నాడా..? మరోసారి కీలక వ్యాఖ్యలు.. వీడియో !

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 10, 2025, 12:00 pm
Advertisement

Journalist Krishnam Raju : రాజధాని అమరావతి మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న జర్నలిస్ట్ కృష్ణంరాజు మరోసారి రెచ్చిపోయారు. ఇటీవల ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియో విడుదల చేస్తూ, తన పాత వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

Advertisement

Journalist Krishnam Raju : జర్నలిస్ట్ కృష్ణంరాజు తప్పు మీద తప్పు చేస్తున్నాడా..? మరోసారి కీలక వ్యాఖ్యలు.. వీడియో !

Journalist Krishnam Raju : మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు .. మహిళల్లో పెరిగిన ఆగ్రహం

దీనిలో భాగంగా కొన్ని పత్రికల కథనాలను చూపిస్తూ, తనకు చెప్పిన విషయాలకు ఆధారాలున్నాయని తెలిపారు. కృష్ణంరాజు తన వీడియోలో గతంలో కొన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురితమైన వార్తలను ప్రదర్శించారు. అవన్నీ తన వ్యాఖ్యలకు బలం చేకూర్చే ఆధారాలుగా పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ తన మాటలను న్యాయబద్ధంగా చూపించడానికి ప్రయత్నించారు. ఈ వ్యాఖ్యలపై మరింతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తప్పు చేసానని చెప్పి క్షేమపణలు చెప్పకుండా ఇంకా సమర్ధించుకోవడం ఫై మహిళలు ఇంకాస్త ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం పోలీస్ కేసుల నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఆయనపై వివిధ ప్రాంతాల నుండి కేసులు నమోదవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించే అవకాశం ఉంది. కృష్ణంరాజు వ్యవహారం ప్రస్తుతం రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి