
Roja : కూటమి సర్కార్ లో మహిళలకు రక్షణ లేదు.. పవన్ నోరుకు ఏమైంది.. తాళం పడిందా ఏంటి అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు
Roja : ఆంధ్రప్రదేశ్‌లో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో తాజాగా రాజకీయ పరిస్థితులు మరింత వేడెక్కాయి. సాక్షి టీవీకి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు రేపుతున్నాయి. అమరావతి మహిళలు ఆగ్రహంతో సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులకు దిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందిస్తూ పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా ఆడిపోసారు. అధికారంలోకి రాకముందు మహిళల విషయంలో పోరాటం చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు పాలనలో భాగస్వామిగా ఉన్నప్పటికీ మౌనంగా ఉన్నారని ఆమె విమర్శించారు.
Roja : కూటమి సర్కార్ లో మహిళలకు రక్షణ లేదు.. పవన్ నోరుకు ఏమైంది.. తాళం పడిందా ఏంటి అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు.. వీడియో..!
మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై స్పందించకపోవడం పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరిని చూపిస్తోందన్నారు. ఒక చిన్నారి పై జరిగిన అత్యాచారాన్ని నిష్పక్షపాతంగా విచారించాల్సిన చోటా, అధికార యంత్రాంగం దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయడం దారుణమని రోజా అభిప్రాయపడ్డారు. అనంతపురంలో గిరిజన విద్యార్థిని ఆరురోజులు కనిపించకపోయినా, పోలీసుల నిర్లక్ష్యం వల్ల శవమై కనిపించిందని ఉదహరించారు. ఇటువంటి ఘటనలపై కూటమి సర్కారు నేతలు నిశ్శబ్దంగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు.
మహిళలకు న్యాయం చేయాలని చెప్పే నాయకులు ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అసలు సమస్యల్ని దాచిపెడుతున్నారని రోజా తీవ్రంగా విమర్శించారు. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నా మహిళలకు రక్షణ లేకపోతే అది దుర్మార్గం కాదా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజల శ్రద్ధను మళ్లించేందుకు ఇతర విషయాలపై దృష్టి పెట్టడం కూటమి తీరుని నిందించారు. మరి రోజా ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానం చెపుతారో..కూటమి సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.