Jr Ntr : యంగ్ టైగర్ ఎన్టీఆర్ Jr Ntr టాలీవుడ్ Tollywood టాప్ హీరోలలో ఒకరు అనే విషయం తెలిసిందే. ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎన్టీఆర్‌ని కలవాలని చాలా మంది అభిమానులు భావిస్తూ ఉంటారు. కొందరు పాదయాత్రలు చేస్తారు. అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానం అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అయితే తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు తారక్. ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్‌మెంట్, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి, అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరారు ఎన్టీఆర్ . మరోవైపు ఆయన కెరీర్‌కి మరింత ప్లస్ అయ్యేలా. ఈ మేరకు తన భార్య లక్ష్మి ప్రణతిని రంగంలోకి దించుతున్నారని సమాచారం.
ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Andhra pradesh Politics జయకేతనం ఎగరవేయాలని ఎంతో మంది కోరుకుంటున్నారు.తాత లాగే ఆయన్ను కూడా సీఎం హోదాలో చూడాలని నందమూరి అభిమానులు ఆశ పడుతున్నారు. ఫ్యాన్స్ డిమాండ్స్ మేరకు ఈ పరిస్థితుల్లో తన భార్యతో కలిసి Jr ntr ఎన్టీఆర్ బిగ్ ప్లాన్ చేశారని సమాచారం. ఎన్టీఆర్ భార్య చేయబోయే బిజినెస్ ఏపీ ప్రజలకు అవసరాలు తీర్చడమే గాక, తనను ప్రజలతో మమేకం చేస్తూ, తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసేలా ఉండనుందనే టాక్ వినిపిస్తోంది.ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్, ఇటీవలే దేవర సినిమా చేసి మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం తన తదుపరి సినిమాల కోసం కసరత్తులు చేస్తూ షూటింగ్స్ అటెండ్ అవుతున్నారు.
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా నుంచి అప్డేట్ అంటే ఫ్యాన్స్ కి స్పెషల్ ఫెస్టివల్ అన్నట్టే లెక్క.…
Laila Movie Trailer : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రామ్ నారాయణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా…
Property : ఈ మధ్య కాలంలోచాలా మంది ప్రజలు తమ ఖర్చులను ఏదో ఒక విధంగా తీర్చుకుంటారు. ఆ క్రమంలోనే…
Thandel Movie Review : నాగ చైతన్య కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ లేదు. కాని ఈ…
Uric Acid : ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య యూరిక్ యాసిడ్ మరియు ఆర్థరైటిస్ నొప్పులు. కొంతమందికి…
Telangana : మోడీ Modi సర్కార్ తెలంగాణకి Telangana కూడా శుభవార్త అందించింది. త్వరలోనే తెలంగాణకు 176.5 కోట్లు రానున్నాయి.…
India vs England : ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు India vs England భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య…
Vidaamuyarchi - Pattudala Review : Kollywood కోలీవుడ్ స్టార్ అజిత్ Ajith లీడ్ రోల్ లో త్రిష హీరోయిన్…
This website uses cookies.