Chandrababu : చంద్రబాబుకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్న కేఏ పాల్..!
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాకవారికి వ్యతిరేఖంగా జగన్ ఒక్కడే కాదు షర్మిళ, కేఏ పాల్ వంటి వారు కూడా గట్టిగా తమ వాయిస్ వినిపిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ ఇన్ పర్సన్‌గా కోర్టులో పిటిషనర్ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీ ప్రస్తుత, గత ప్రభుత్వాలు సైతం ప్రత్యేక హోదా కోరుతున్న వైనాన్ని ప్రస్తావించారు. కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.ఈ వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నరేందర్, జస్టిస్ కిరణ్ మై తో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేయడం విశేషం.
హోదా అంశంపై పూర్తి వివరాలు సమర్పించాలంటూ కేంద్ర హోం, ఆర్థిక శాఖల కార్యదర్శులు, నీతి ఆయోగ్ ఛైర్మన్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపించింది. ఈ పిల్‌పై తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. ప్రత్యేక హోదా అంశంపై మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయని.. ప్రస్తుత పిల్‌ను కూడా వాటితో జత చేయాలని కేంద్ర ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టును కోరారు. గతంలో ప్రత్యేక హోదావపై దాఖలైన పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుత పిల్‌ను కూడా వాటితో కలిపి ఏ బెంచ్ విచారణ చేయాలో నిర్ణయించేందుకు ఫైల్‌ను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీలో ప్రధాన సమస్యలపై హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Chandrababu : చంద్రబాబుకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్న కేఏ పాల్..!
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై పిల్ దాఖలు చేసిన ఆయన.. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశంపైనా హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దని.. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పైనా విచారణ జరుగుతోంది.. తాజాగా ప్రత్యేక హోదా అంశంపై కూడా విచారణ మొదలైంది. ఈ కేసుతో కెఏ పాల్ ఏపీలో హీరో అయ్యారు.కేసు తదుపరి విచారణను ఈ నెల 24 కు వాయిదా వేసింది. ప్రత్యేక హోదాని అంతా మరచిపోతున్న తరుణంలో ఆ తేనే తుట్టెను కేఏ పాల్ కదిల్చారు. గత కొద్దిరోజులుగా కేఏ పాల్ ప్రత్యేక హోదాపై గట్టిగానే పోరాడుతున్నారు. ఏదో విధంగా కేంద్రం చెవిలో జోరిగలా ఈ హోదా మాట వినిపించేలా చేశారు. ఇప్పుడు ఏకంగా హైకోర్టు నుంచి నోటీసులు వచ్చేలా చేశారాయన.
Caste Survey : తొలిసారిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కుల గణన చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ…
Anil Kumar Yadav : నెల్లూరు జిల్లాలో మైనింగ్ మూసివేతపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్…
Feeding Cows : హిందూ సంస్కృతిలో ఆవులకు ఆహారం పెట్టడం లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది.…
Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా తక్కువే అని చెప్పాలి. జియో…
Morning or night shower : ఇది మనలో చాలా మందికి రోజువారీ ఆచారం. ఉదయం స్నానం లేదా రాత్రి…
Tejaswi Madivada : చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. వారిలో తేజస్వి మదివాడ…
Masoor Dal : ఎర్ర పప్పు అని కూడా పిలువబడే మసూర్ పప్పు, భారతీయ వంటకాల్లో పోషక విలువలు, చికిత్సా…
Ys Jagan : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను…
This website uses cookies.