
Kesineni Nani : లిక్కర్ స్కామ్ లో కేశినేని చిన్నికి భాగం ఉంది కేశినేని నాని..!
Kesineni Chinni : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేశినేని బ్రదర్స్, కేశినేని నాని మరియు కేశినేని చిన్ని మధ్య కొనసాగుతున్న వివాదం రోజు రోజుకు పిక్ స్టేజ్ కి వెళుతుంది. తాజాగా ట్విట్టర్ వేదికగా ఇరువురు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకున్నారు. కేశినేని నాని.. కసిరెడ్డి రాజ్ తో కేశినేని చిన్ని వ్యాపార సంబంధాలను బయటపెట్టాడు. రాజ్ కసిరెడ్డి మరియు చిన్ని కలిసి Pryde Infracon LLP మరియు Eshanvi Infra Projects Pvt Ltd సంస్థలను నిర్వహిస్తున్నారని, వీటి ద్వారా విదేశాలకు పెద్ద మొత్తంలో సొమ్ము తరలించే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ ఆరోపణలతో పాటు, నాని, చంద్రబాబు కు సమగ్ర దర్యాప్తు చేయాలని సూచించారు.
Kesineni Nani : లిక్కర్ స్కామ్ లో కేశినేని చిన్నికి భాగం ఉంది కేశినేని నాని..!
ఇదే సమయంలో కేశినేని చిన్ని ఈ ఆరోపణలను ఖండించారు. కేశినేని నాని నీతిమాలిన ఆరోపణలకు స్పందించేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే ప్రజా ప్రతినిధిగా ప్రజలకు, పార్టీ క్యాడర్ కు స్పష్టత ఇవ్వడం కోసం స్పందిస్తున్నానన్నారు. వెన్నుపోటు దారుడు, నయవంచకుడు, నమ్మక ద్రోహీ, జగన్ రెడ్డికి గూఢచారిగా పని చేసిన వ్యక్తి కేశినేని నాని అని మండిపడ్డారు. ఇప్పుడు పనిగట్టుకుని చేసే పనికిమాలిన, పసలేని ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. తాను క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ముందు మా సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉన్నందున సంయుక్తంగా నిర్మాణం చేపట్టడానికి 2021లో ఆ సంస్థను రిజిస్టర్ చేసినట్లు చిన్ని వివరించారు.
ఆ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్ లో అందరికి అందుబాటులో ఉన్నాయని చెప్పారు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కసిరెడ్డి సంస్థతో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా అప్పుడే నిర్ణయం తీసుకున్నానని చిన్ని వివరించారు. తద్వారా ఆర్థికంగా నష్టపోయానని వివరించారు. ఇక అమెరికా, దుబాయ్ కంపెనీలు అంటూ నాని సృష్టించిన ఫేక్ కంపెనీలను నిరూపించాల్సిన బాధ్యత.. నాపై ఆరోపణలు చేసిన వారిపైనే ఉంటుందని స్పష్టం చేశారు. నానికి సత్తావుంటే నాకు, కసిరెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలను నిరూపించాలని సవాల్ చేశారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.