AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు..?
ప్రధానాంశాలు:
AP Liquor Scam : బిగ్ బ్రేకింగ్.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు..!
లిక్కర్ స్కామ్ ప్రైమరీ ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు
AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించిన లిక్కర్ స్కాం కేసు విచారణకు కొత్త ఊపు వచ్చింది. ఈ కేసులో శనివారం ఎంపీ మిథున్ రెడ్డిని విచారించిన అనంతరం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. జగన్ హయాంలో అమలులోకి వచ్చిన కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పనలో మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. పాలసీలో అవకతవకలద్వారా పెద్ద ఎత్తున అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలినట్టు సమాచారం.

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు..!
AP Liquor Scam : జగన్ హయాంలోనే లిక్కర్ స్కామ్ జరిగింది – సిట్
ఈ కేసులో ఇప్పటికే అరవైకి పైగా మందుల కంపెనీలు, మధ్యవర్తులు, రాజకీయ ప్రముఖులపై అనేక ఆధారాలు సేకరించిన సిట్, తాజాగా 305 పేజీల ప్రిలిమినరీ ఛార్జ్ షీట్‌ను దాఖలు అయినట్లు సమాచారం. ఇందులో కొత్తగా మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో అనిరుధ్ రెడ్డి, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రూన్ ఉన్నారు. దీంతో లిక్కర్ స్కాం కేసులో నిందితుల సంఖ్య మొత్తం 48కి పెరిగింది.
ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్‌లో మొత్తం 16 మందిపై అభియోగాలు మోపబడ్డాయి. ఇందులో ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మాధ్యమం వ్యక్తులు కూడా ఉన్నారు. లిక్కర్ స్కాంలో ప్రభుత్వ విధానాలను తమ ప్రయోజనాలకు అనుగుణంగా మలిచారని, భారీగా లాభాలు పొందారని సిట్ నివేదికలో పేర్కొంది. విచారణ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాలు ఈ కేసు తీవ్రతను స్పష్టంగా సూచిస్తున్నాయి.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
లిక్కర్ కేసులో సిట్ ప్రైమరీ ఛార్జ్‌షీట్
305 పేజీలతో ప్రైమరీ ఛార్జ్‌షీట్ దాఖలు
ప్రైమరీ ఛార్జ్‌షీట్‌లో మాజీ సీఎం జగన్ పేరు
జగన్‌కు తెలిసే స్కామ్ జరిగిందన్న సిట్
లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిది కీలక పాత్ర ఉందన్న సిట్ pic.twitter.com/WOFmrC4Vib
— BIG TV Breaking News (@bigtvtelugu) July 21, 2025