Kiran Royal : నాకు రోజుకో అమ్మాయి కావాలి.. జ‌న‌సేన నాయ‌కుడు కిరణ్ రాయల్ సంచలన ఆడియో లీక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kiran Royal : నాకు రోజుకో అమ్మాయి కావాలి.. జ‌న‌సేన నాయ‌కుడు కిరణ్ రాయల్ సంచలన ఆడియో లీక్

 Authored By prabhas | The Telugu News | Updated on :18 February 2025,2:02 pm

ప్రధానాంశాలు:

  •  Kiran Royal : నాకు రోజుకో అమ్మాయి కావాలి.. జ‌న‌సేన నాయ‌కుడు కిరణ్ రాయల్ సంచలన ఆడియో లీక్

Kiran Royal : తిరుపతి tirupati జనసేన నాయకుడు కిరణ్ రాయల్ Kiran Royal చీకటి బాగోతాలు ఒక్కొక్కటి వ‌రుస‌గా వెలుగులోకి వస్తున్నాయి. త‌న నుండి రూ. కోటికి పైగా న‌గ‌దు, 25 స‌వ‌ర్ల బంగారం కిర‌ణ్ రాయ‌ల్‌ కాజేసిన‌ట్లు, అందుకే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాంటూ ల‌క్ష్మీ lakshmi అనే మ‌హిళ మాట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. బాధిత మ‌హిళ‌తో కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న వీడియో సైతం బయటకు వచ్చింది. అంతేకాకుండా అప్పు తీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతామని బెదిరిస్తున్నాడని ఆమె పేర్కొంది. ఇదిలా ఉంటే బాధితురాలు లక్ష్మితో కిరణ్ రాయల్ మాట్లాడిన ఆడియో కాల్ రికార్డ్‌ను వైసీపీ తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆడియో క్లిప్‌లో కిరణ్ రాయల్ మాట్లాడుతూ..”నాకు అమ్మాయిల వీక్‌నెస్ ఉంది. నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉంటా. నేను మారలేను. కానీ, నిన్ను మాత్రం బాగా చూసుకుంటా అని చెప్పడం వినిపించింది.

Kiran Royal నాకు రోజుకో అమ్మాయి కావాలి జ‌న‌సేన నాయ‌కుడు కిరణ్ రాయల్ సంచలన ఆడియో లీక్

Kiran Royal : నాకు రోజుకో అమ్మాయి కావాలి.. జ‌న‌సేన నాయ‌కుడు కిరణ్ రాయల్ సంచలన ఆడియో లీక్

Kiran Royal చాలా మంది అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నా

నా కూతూరు మీద ఒట్టు. నేను చాలా మంది అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నా. నీకు 10 ఏళ్ల వయసు ఉండొచ్చేమో.. అప్పుడు రోజుకో అమ్మాయితో తిరిగే వాడ్ని. నీకు నలుగురి గురించే మాత్ర‌మే తెలుసు. కానీ నీకు తెలిసిన ఆరుగురితో నేను తిరిగాను. ఈ ఏడు నెలల్లోనే ఆరుగురితో తిరిగా. ఇప్పటికీ ఇద్దరు అమ్మాయిలతో వాళ్ల ఇంటికి వెళ్తాను. మొత్తంగా నాకు ఓ 400 మందితో సంబంధం ఉండొచ్చని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు.

Kiran Royal నేను ఎక్కడికీ పారిపోలేదు : కిరణ్ రాయల్

బాధితురాలు లక్ష్మితో కిరణ్ రాయల్ మాట్లాడిన ఆడియో కాల్ రికార్డ్‌ను వైసీపీ తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంపై కిర‌ణ్ రాయ‌ల్ స్పందించారు. త‌న‌పై దుష్ప్రచారం చేయడానికి వైసీపీ పేటీఎం డాగ్స్ చాలా కష్టపడుతున్న‌ట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలు వాస్తవాలు కాద‌న్నారు. ఆ ఆడియోలను కోర్టుకు సమర్పించిన‌ట్లు తెలిపారు. తాను న్యాయస్థానంలో ఈ విష‌యాన్ని తేల్చుకుంటాన‌ని వెల్ల‌డించాడు. త‌న‌ దగ్గర కూడా కొన్ని ఆడియోలు ఉన్న‌ట్లు, వాటిని కోర్టుకు సమర్పించనున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితం కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. త‌న‌ను ఎవరు ఏం చేయ‌లేర‌ని, తాను పవన్ కల్యాణ్‌నే బ్లాక్ మెయిల్ చేస్తా నువ్వెంత‌ అంటూ కిరణ్ రాయల్ త‌న‌ని బెదిరించాడని లక్ష్మి ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది