Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు ఒక్కొక్కరిగా నామినేషన్స్ వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు పలుచోట్ల నుండి నామినేషన్స్ వేయగా ఇటీవల వైసీపీ నాయకుడు కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇక ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వైసీపీ అభ్యర్థిగా గుడివాడ నియోజకవర్గం నుండి నామినేషన్ వేయడం జరిగింది. నా నామినేషన్ కు పెద్ద సంఖ్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజానీకం చాలామంది పాల్గొని విజయవంతం చేశారు.వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను . ఇక ఈ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల అధికార పాలనను పూర్తిచేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నికలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల అనేక రకాల సభలను నిర్వహించి ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను , మళ్లీ అధికారంలోకి వస్తే చేసే మంచి గురించి మా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు వివరిస్తూ వచ్చారు.
అలాగే ఈసారి జరగబోయే ఎలక్షన్స్ లో కూడా వైసీపీ పార్టీ విజయకేతనం ఎగరవేయడంలో ఎలాంటి సందేహం లేదంటూ కొడాలి నాని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ అందించినటువంటి సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజానీకం అందరూ కూడా తిరిగి మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోరుకుంటున్నారని కొడాలి నాని తెలియజేశారు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కొందరు జగన్ అది చేయలేదు ఇది చేయలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఎన్నికలను ముగించాలని , దానికే వైసీపీ పార్టీ కట్టుబడి ఉందంటూ కొడాలి నాని తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అక్కడక్కడ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ , మేము అలాంటి వాటికి తెరదించమంటూ తెలిపారు.
అలాగే చంద్రబాబు నాయుడు 2014లో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాడో ఇప్పుడు కూడా అదే విధంగా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని కొడాలి నాని పేర్కొన్నారు.2014లో ఇచ్చిన మేనిఫెస్టోనే ఇప్పుడు కూడా చూపిస్తూ చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, 2014 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అని ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇదే రకమైనటువంటి మేనిఫెస్టోను చూపిస్తూ చంద్రబాబు మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని కొడాలి నాని తెలియజేశారు. కావున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్ర ప్రజలు చంద్రబాబు మోసాలకు బలి కావద్దని సంక్షేమ పథకాలతో ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకుంటున్నటువంటి జగన్ కు మరోసారి అధికారం ఇవ్వాల్సిందిగా కొడాలి నాని కోరారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.