Kodali Nani : గన్నవరం సభలో ఉచ్చ పోయిస్తా.. అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కొడాలి నాని దిమ్మతిరిగే కౌంటర్.. వీడియో !!
Kodali Nani : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొన్ని రోజుల క్రితం గన్నవరంలో భారీ బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని లను ఉద్దేశించి లోకేష్ మంది పడటం జరిగింది. వచ్చే ఎన్నికలలో ఈ ఇద్దరి నాయకులను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వాళ్ళిద్దరికీ తెలుగుదేశం పార్టీ రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని.. చెప్పుకొచ్చారు. అనవసరంగా రాజకీయాలలో తన కుటుంబ సభ్యులపై కొడాలి నాని వంశీ ఇద్దరు నోరు పారేసుకుని తప్పు చేశారు.
వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళకి మామూలుగా ఉండదు. ఒక్కొక్కరికి ఉచ్చ పోయిస్తా.. అంటూ లోకేష్ మండిపడ్డారు. దీంతో గన్నవరంలో చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కొడాలి నాని దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నీ తండ్రి అయితే గుడివాడలో పోటీ చేయాలని, గన్నవరంలో నువ్వు పోటీ చేయాలని లోకేష్ కి కొడాలి నాని సవాల్ విసిరారు. తల్లిని అవమానించినందుకు ప్రతికారంగా లోకేష్ వచ్చి తన మూత్రం తీసుకెళ్తాడంటూ ఎద్దేవా చేశారు.
అసలు అసెంబ్లీలో చంద్రబాబు విమర్శించిన క్రమంలో అతని తల్లి గురించి వేరే వ్యక్తులు కామెంట్లు చేశారు. వాటిని నాపైకి వంశీ మీదకి ఎగదొస్తున్నారు. డైపర్ వేసుకుని కుప్పం నుండి పాదయాత్ర మొదలుపెట్టిన లోకేష్.. తనను డ్రాయర్ పై నిలబెడతాడా అని ప్రశ్నించారు. 50 ఏళ్లు కలిగిన నాకు లోకేష్ వచ్చి రోజూ మూత్రం పోయిస్తాడా..? అంటూ సెటైర్లు వేశారు.