Kodali Nani : కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటూ చంద్రబాబుపై కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు..!!

Advertisement

Kodali Nani : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు చేసిన దుర్మార్గాలకు.. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి జరగాల్సిందే జరిగింది అన్నట్టు చెప్పుకొచ్చారు. ఇటువంటి వ్యక్తులు కోర్టులు, వ్యవస్థలు మేనేజ్ చేయగలం..

Advertisement

ఆలోచనలు చేసే ఇటువంటి అవినీతిపరులు..ఇకనైనా కళ్ళు తెరిచి చట్టానికి లొంగిపోవాలని కోరారు. నారా లోకేష్ ఎర్ర బుక్కు పెట్టి ఏదో రాస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. చంద్రబాబుని వైఎస్ జగన్ లాకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టాడు.. దీన్ని కూడా రాసుకో అని అన్నారు. జగన్ వెంట్రుక కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పీకలేరని స్పష్టం చేశారు. లోకేష్ సరిగ్గా మాట్లాడాలి లేకపోతే అతను కూడా జైలుకు వెళ్లే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.

Advertisement
Kodali Nani Reacts On Chandrababu Arrest

ఈ కేసులో సరైనా సాక్షాధారాలు లేవని రాజకీయ కక్ష సాధింపు అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయగా అలాంటప్పుడు ఏసీబీ కోర్టులో నుంచి చంద్రబాబు నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు కదా అంటూ కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్టు విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా బాగానే ఉన్నా గాని పవన్ కళ్యాణ్ రోడ్డు మీద ఎందుకు దొర్లుతున్నాడో రాష్ట్రంలో ఎవరికి అర్థం కావడం లేదని అన్నారు.

Advertisement
Advertisement