Kodali Nani : ప్రశాంత్ కిషోర్ వేస్ట్ గాడు.. వాడిని నమ్మకుంటే చంద్రబాబు నట్టేట మునుగుతాడు.. కొడాలి సంచలన వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kodali Nani : ప్రశాంత్ కిషోర్ వేస్ట్ గాడు.. వాడిని నమ్మకుంటే చంద్రబాబు నట్టేట మునుగుతాడు.. కొడాలి సంచలన వ్యాఖ్యలు

Kodali Nani : ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈసారి ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్.. టీడీపీ గెలుపు కోసం పని చేస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తాజాగా స్పందించారు. వాళ్ల భేటీపై సెటైర్లు వేశారు. ప్రశాంత్ కిషోర్ ను మేము పూర్తిగా వాడేశాం. ఆయన బుర్రలో గుజ్జు మొత్తం అయిపోయింది. ఐప్యాక్ తో ప్రశాంత్ కిషోర్ కు సంబంధం లేదు. 2014 లోనే ప్రశాంత్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :25 December 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  ప్రశాంత్ కిషోర్ ను 2014 లోనే మేము వాడేశాం

  •  మేము వాడేసిన వాడిని 2024 లో వాడుకుంటా అంటున్నాడు

  •  గుజ్జు అంతా అయిపోయింది

Kodali Nani : ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈసారి ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్.. టీడీపీ గెలుపు కోసం పని చేస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తాజాగా స్పందించారు. వాళ్ల భేటీపై సెటైర్లు వేశారు. ప్రశాంత్ కిషోర్ ను మేము పూర్తిగా వాడేశాం. ఆయన బుర్రలో గుజ్జు మొత్తం అయిపోయింది. ఐప్యాక్ తో ప్రశాంత్ కిషోర్ కు సంబంధం లేదు. 2014 లోనే ప్రశాంత్ కిషోర్ ను మేము వాడేశాం. బుర్రలో గుజ్జు అంతా అయిపోయింది. చంద్రబాబు ఆయన్ను తీసుకెళ్లి మళ్లీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను పెట్టుకొని వ్యూహకర్త అంటాడు.

మేము వ్యూహకర్తగా పెట్టుకుంటే వాడు బీహార్ నుంచి వచ్చాడు తమ్ముళ్లు.. వాడు ఏం పీకుతాడు. మనకంటే గొప్పోళ్లు ఎవరైనా ఉన్నారా తమ్ముళ్లు అని అన్నాడు. 2019 లో వాడేసిన వాడిని తీసుకొచ్చి 2024 లో వాడుదామని అనుకుంటున్నాడు. అసలు ప్రశాంత్ కిషోర్ కు, ఐప్యాక్ కు సంబంధం లేదు. వెస్ట్ బెంగాల్ లో ఎన్నికల తర్వాత నేను వ్యూహకర్తగా ఉండటం లేదు. తప్పుకున్నాను. రాజకీయ పార్టీ పెట్టాను అని చెప్పి బీహార్ లో పార్టీ పెట్టి పాదయాత్ర చేశాడు. ఈరోజు మమతా బెనర్జీ మాట్లాడమని చెబితే, చంద్రబాబును ఇండియా కూటమిలో చేరాలని చెప్పి అడగడానికి చర్చలు జరపడానికి వచ్చాడు.

Kodali Nani : ఒక పీకే బీజేపీతో.. మరో పీకే కాంగ్రెస్ తో

చంద్రబాబు ఒక పక్కన పవన్ కళ్యాణ్ లాంటి ఒక పీకే ను పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. ఇంకో పీకేను పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ, కాంగ్రెస్ కూటమితో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం. ఎవడు అధికారంలోకి వస్తారో చంద్రబాబుకు అర్థం కావడం లేదు. కేంద్రంలో బీజేపీ వస్తుందా? కాంగ్రెస్ వస్తుందా? అర్థం కావడం లేదు. అందుకే వాడు కాకపోతే వీడు.. వీడు కాకపోతే వాడు. ఒక పీకే బీజేపీతో మాట్లాడుతాడు. ఇంకో పీకే కాంగ్రెస్ తో మాట్లాడుతాడు అంటూ కొడాలి నాని మండిపడ్డారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది