Kodali Nani : బిగ్ బ్రేకింగ్.. కొడాలి నానికి గుండెపోటు..?
ప్రధానాంశాలు:
Kodali Nani : బిగ్ బ్రేకింగ్.. కొడాలి నానికి గుండెపోటు..?
Kodali Nani : ఏపీ మాజీ మంత్రి, వైసీపీ Ysrcp సీనియర్ నాయకుడు కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్యతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ (ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ) ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయనను తక్షణమే ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ వార్త రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

Kodali Nani : బిగ్ బ్రేకింగ్.. కొడాలి నానికి గుండెపోటు..?
Kodali Nani హాస్పటల్ లో కొడాలి నాని.. ఆందోళనలో పార్టీ శ్రేణులు
కొడాలి నాని గత కొంతకాలంగా రాజకీయ కార్యక్రమాల్లో తక్కువగా కనిపిస్తున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నారని సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. తాజాగా గుండెపోటు రావడంతో వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉండటంతో త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నారు.