Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూకుడు కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుందా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూకుడు కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుందా ?

 Authored By ramu | The Telugu News | Updated on :7 December 2024,4:18 pm

ప్రధానాంశాలు:

  •  Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూకుడు కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుందా ?

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ పేరుకి ప‌వర్ ఎక్కువ‌. ఆయ‌న సినిమాల‌లో అయిన రియ‌ల్ లైఫ్ అయిన స‌రే చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ప్ర‌స్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉన్నారు.కూటమిలో ఒకడిలా కాకుండా కూటమికి ఒక్కడిలా ఎదిగారు పవన్. ఢిల్లీలో పలుకుబడి పెంచుకున్నారు. ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైన వెళ్లే రకం పవన్. ఆ గుణమే ఆయనను లీడర్ గా నిలబెట్టింది. మహారాష్ట్ర ఫలితాల తర్వాత పవన్ క్రేజ్ పై దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. ఆయన పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ గా మారబోతున్నారా? పవన్ ఏది అడిగినా మోదీ సర్కార్ వెంటనే ఓకే చెబుతోంది కూడా అందుకేనా? ఎన్డీయేలో పవన్ ఈ రేంజ్ ప్రాధాన్యత వెనక అసలు కారణం ఏంటి? అని అంద‌రు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

Pawan Kalyan ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూకుడు కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుందా

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూకుడు కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుందా ?

అయితే ప‌వ‌న్ లేవ‌నెత్తుతున్న కొన్ని విష‌యాలు కూట‌మిని ఇబ్బంది పెట్టేలా క‌నిపిస్తున్నాయి. సనాతన ధర్మం అంటూ ఆయన వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. దాని వల్ల కూటమికి కొంత ఇబ్బంది ఎదురైనా సర్దుకున్నారు. ఆ తరువాత లా అండ్ ఆర్డర్ ఏపీలో సరిగ్గా లేదని చెప్ప‌డంతో కూటమి ప్రభుత్వం కూడా ఇబ్బందిలో పడింది. ఇక లేటెస్ట్ గా చూస్తే ఆయన కాకినాడకు వెళ్ళి సముద్రం మధ్యలో ఉన్న షిప్ ని పరిశీలించారు. సీజ్ ద షిప్ అంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంతవరకూ బాగానే ఉన్నా మీడియా ముందుకు వచ్చి ఆయన అధికారుల తీరు మీద విమర్శలు చేశారు. అయితే అధికారులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే. వారిని విమర్శిస్తే అది ప్రభుత్వం మీదకే వస్తుందని విశ్లేషకులు చెబుతున్న మాట‌.

పవన్ విమర్శలు చేసిన ప్రతీసారీ కూటమి ప్రభుత్వం స్పందిస్తొంది. తగిన చర్యలు తీసుకుంటోంది. అయితే నాలుగు గోడల మధ్యన కేబినెట్ మీటింగులలో ఈ విషయాలను లేవనెత్తి వాటికి అక్కడే అర్ధవంతమైన పరిష్కారాలను కనుగొంటే మరింత ఎఫెక్టివ్ గా ప్రభుత్వం పనిచేయడానికి వీలు అవుతుంది. అలా కాకుండా బయట అసంతృప్తి వ్యక్తం చేస్తే ప్ర‌భుత్వంలోనే పొరపాట్లు జరుగుతున్నాయని జనాలు అనుకుంటారు. చివరికి ప్రతిపక్షానికి అదే ఆయుధంగా మారుతుందని అంటున్నారు. ఇలా చూస్తే కనుక వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. వాటి మీద మరీ పట్టింపుగా ఉంటే ప్రభుత్వం కానీ పార్టీ కానీ ముందుకు పోలేదనే అంటారు. అయితే చంద్రబాబు విశేషమైన అనుభవం ఉన్న వారు కాబట్టి పవన్ లేవనెత్తిన ప్రతీ అంశం మీద లాజికల్ ఎండ్ కి తీసుకుని వచ్చి ఆయనతో పాటు అందరికీ సంతృప్తి పరచేలా డెసిషన్స్ తీసుకుంటున్నారు. రానున్న రోజులలో ఇవి మ‌రింత ఎక్కువ కాకుండా చూసుకుంటే మంచిది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది