Lagadapati Rajagopal : పవన్ కళ్యాణ్ ని టచ్ చేసే దమ్ము జగన్ కి లేదు … ఏపీ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన లగడపాటి రాజగోపాల్.. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Lagadapati Rajagopal : పవన్ కళ్యాణ్ ని టచ్ చేసే దమ్ము జగన్ కి లేదు … ఏపీ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన లగడపాటి రాజగోపాల్..

Lagadapati Rajagopal : ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలకు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరు గెలుస్తారు అనేదానిపై ఉత్కంఠత రేపింది. ఈ క్రమంలోనే వై.యస్.జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థుల ఖరారును వేగవంతం చేస్తున్నారు. టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని జగన్ ను ఓడించాలనే ధీమాతో ఉంది. ఇక కాంగ్రెస్ లోకి వై.యస్.షర్మిల ఎంట్రీ ఇచ్చి సెన్సేషనల్ గా మారారు. కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని మాజీలను ఆహ్వానిస్తున్నారు. ఈ సమయంలోనే ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న […]

 Authored By anusha | The Telugu News | Updated on :9 January 2024,2:00 pm

Lagadapati Rajagopal : ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలకు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరు గెలుస్తారు అనేదానిపై ఉత్కంఠత రేపింది. ఈ క్రమంలోనే వై.యస్.జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థుల ఖరారును వేగవంతం చేస్తున్నారు. టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని జగన్ ను ఓడించాలనే ధీమాతో ఉంది. ఇక కాంగ్రెస్ లోకి వై.యస్.షర్మిల ఎంట్రీ ఇచ్చి సెన్సేషనల్ గా మారారు. కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని మాజీలను ఆహ్వానిస్తున్నారు. ఈ సమయంలోనే ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఏపీలో ఎన్నికల పోరుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత లగడపాటి రాజకీయాలపై స్పందించారు. పూర్తిగా వ్యాపారాలకి పరిమితమైన లగడపాటి తాజాగా రాజమండ్రి వచ్చారు. మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్ తో సమావేశం అయ్యారు.  లగడపాటి టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆయన స్పందించారు.

తను మళ్లీ రాజకీయాలలోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. గతంలో లగడపాటి సర్వేలకు ప్రాచుర్యం ఉండేది. 2019 ఎన్నికల్లో లగడపాటి సర్వే అంచనాలు తప్పడంతో అప్పటినుంచి ఆయన సర్వేలకు దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఏపీ ఎన్నికలు హోరాహోరీగా కనిపిస్తున్న సమయంలో ఆయన ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్య ఎన్నికల సమరం ఉంటుందని స్పష్టం చేశారు. తమిళనాడు తరహాలోనే ఏపీలో ఎన్నికల రాజకీయం ఉంటుందని అన్నారు. జాతీయ పార్టీలకు అవకాశం లేదని చెప్పారు. తాను ఎలాంటి సర్వేలు చేయడం లేదన్నారు. ప్రజల ఆలోచన ఏంటనేది మాత్రం గుర్తించడం కష్టమని చెప్పారు. ఏపీలో షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. షర్మిల ఎంట్రీ తో జగన్ ఓటింగ్ చీలిక తమకు మేలు జరుగుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు

అయితే షర్మిల రాకతో జగన్ వ్యతిరేక ఓటు మాత్రమే చీలుతుంది అనేది వైసీపీ ముఖ్య నేతల విశ్లేషణ. తాము పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ పైన నమ్మకంతో ఉన్నామని చెబుతున్నారు. లగడపాటి అంచనాలతో ఏపీలో షర్మిలకు కాంగ్రెస్ వలన ఎటువంటి ప్రయోజనం లేదనే విధంగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఎన్నికల ముందు కంటే తర్వాత ఎన్డీఏలో చేరితే ప్రయోజనం అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అటు పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో వెళ్లడమే ప్రయోజనకరమని భావిస్తున్నారు. దీంతో బీజేపీ నుంచి ఒక స్పష్టత కోసం వేచి చూస్తున్నారు. ఇక జగన్ ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్ గా బరిలోకి దిగుతున్నారు. ఈసారి గెలుపు పార్టీలకంటే జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి

anusha

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక