Lokesh Delhi Tour : లోకేష్ ఢిల్లీ అంటే వణికిపోతున్న వైసీపీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lokesh Delhi Tour : లోకేష్ ఢిల్లీ అంటే వణికిపోతున్న వైసీపీ

 Authored By sudheer | The Telugu News | Updated on :6 September 2025,7:00 pm

Lokesh Delhi Tour : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తాజాగా ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగివచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కావడం, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం లోకేష్ తన సోషల్ మీడియా వేదికగా చర్చించిన విషయాలను వివరించారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ పర్యటన వెనుక మరో రాజకీయ వ్యూహం దాగి ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

lokesh delhi

lokesh delhi

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నడుమ లోకేష్ ఢిల్లీకి వెళ్లడం విశేష చర్చనీయాంశమైంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైన అనిల్ రెడ్డి పీఏ దేవరాజు విచారణలో ఉన్న సమయంలోనే ఈ పర్యటన జరగడం అనుమానాస్పదంగా ఉందని వైసీపీ భావిస్తోంది. దేవరాజు విచారణలో కీలకమైన వివరాలు బయటపెట్టారన్న ప్రచారం ఉండటంతో, లోకేష్ ఢిల్లీ పర్యటన ఈ పరిణామాలతో ముడిపడి ఉందని పాలక పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అంతేకాకుండా లిక్కర్ స్కామ్ సూత్రధారులపై చర్యలు తీసుకునే దిశగా లోకేష్ ఢిల్లీలో ముందస్తు కసరత్తు పూర్తి చేశారని వైసీపీ అనుమానిస్తోంది. ఆయన బీజేపీ పెద్దలకు పక్కా ఆధారాలు సమర్పించారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల వరకు ఎటువంటి పెద్ద రాజకీయ పరిణామాలు వెలుగులోకి రాకపోవచ్చని, ఆ తర్వాత పరిస్థితులు మారవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ కలిపి, రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన వాతావరణం నెలకొంది.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది