Mahesh Babu : రూ.3000 కోట్లతో కేంద్రం నుంచి మెడికల్ కాలేజీని దింపిన మహేశ్ బాబు.. షాక్ లో సీఎం జగన్
ప్రధానాంశాలు:
మహేశ్ ఆసుపత్రికి రూ.3000 కోట్ల నిధులు అందజేయనున్న కేంద్రం
చిన్నపిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించేందుకే ఈ నిర్ణయం
మహేశ్ బాబుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కేంద్రం
Mahesh Babu : టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ అనే చెప్పుకోవాలి. ఎందరో చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి దేవుడయ్యారు. తను ప్రజలకు ఎంతో సేవ చేస్తారు కానీ.. ఎవ్వరికీ చెప్పుకోరు. తనను తాను అస్సలు ప్రమోట్ చేసుకోరు. తమకు సాయం కావాలని ఎవరైనా తన దగ్గరికి వెళ్తే వెంటనే తనకు తోచిన సాయం చేస్తారు. టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఉన్నా మహేశ్ బాబు రూటే వేరు. ఆయన చేసే సేవలు గొప్పవి. తెలుగు ఇండస్ట్రీలోనూ ఆయన టాప్ మోస్ట్ హీరోలలో ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా మహేశ్ సినిమాలు రికార్డులు సృష్టిస్తాయి. ఓపెనింగ్ రాబట్టడంలోనూ మహేశ్ బాబుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఓవైపు సినిమాలు, మరోవైపు సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు మహేశ్. చారిటీ చేయడంలో మహేశ్ ఎప్పుడూ ముందుంటారు.
ఆయన కుటుంబ సభ్యులు కూడా సామాజిక సేవలో ముందుంటారు. ఆయన భార్య నమ్రత, కూతురు సితార కూడా సామాజిక సేవలో ముందుంటారు. అందుకే మహేశ్ బాబుకు అండగా ఉండాలని కేంద్రం అండగా ఉండాలని భావించినట్టు తెలుస్తోంది. చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్ కోసం కొన్ని కోట్లను ఖర్చు పెట్టారు మహేశ్. ఈ క్రమంలోనే మహేశ్ బాబు చిన్నపిల్లలకు ఉచితంగా చేయిస్తున్న గుండె ఆపరేషన్ల కోసం ఒక ఆసుపత్రిని ఏపీలో కట్టాలని భావిస్తున్నారట. రూ.3000 కోట్ల నిధులతో ఈ ఆసుపత్రిని నిర్మించాలని అనుకుంటున్నారట. ఇదే విషయంపై మహేశ్ బాబు బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర పెద్దలతో మాట్లాడారట.
Mahesh Babu : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసుపత్రులు
కేంద్ర ప్రభుత్వ సాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేశ్ బాబు.. పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించేందుకు పెద్ద ఆసుపత్రులు నిర్మించాలని భావిస్తున్నారట. దానికి కేంద్రం నుంచి కూడా భారీగా నిధులు వస్తున్నాయట. కేంద్ర ప్రభుత్వం ఇంతగా మహేశ్ బాబుకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఏపీ ప్రభుత్వం కూడా షాక్ అయిందట. ఏపీలో మహేశ్ బాబు నిర్మించబోయే ఆసుపత్రికి అన్ని వేల కోట్ల నిధులు ఇవ్వడంపై సీఎం జగన్ ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది.