Chiranjeevi : దాదాపు 45 సంవత్సరాల సుదీర్ఘ సేవను గుర్తించిన తర్వాత ఇటీవల భారత ప్రభుత్వం తెలుగు సినీ ఇండస్ట్రీ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డును అందించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ పద్మభూషణం అవార్డును రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గురువారం సాయంత్రం 6 గంటలకు అందజేశారు.ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి సతిమని సురేఖ , కుమారుడు రాంచరణ్ తో పాటు కోడలు ఉపాసన కూడా పాల్గొనడం జరిగింది. ఇక ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మెగా ఫ్యామిలీ మొత్తం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్ పోర్ట్ వద్ద మెగాస్టార్ చిరంజీవి ప్రెస్ మీట్ ఇచ్చారు.
ఈ సందర్భంగా శుక్రవారం రోజు మీడియాతో మాట్లాడిన పద్మభూషణ్ చిరంజీవి తనకు ఈ అరుదైనా ఘనత దక్కడానికి వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఏ టైం కు ఏది రావాలంటే అది వస్తుందని తాను దేనికోసం ఎదురు చూడాలని తెలియజేశారు. అలాగే నందమూరి తారక రామారావు గారికి కూడా భారతరత్న అవార్డు రావాలని ఆయనకు అవార్డు ఇవ్వటం అనేది సముచితమని చిరంజీవి సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎంజీఆర్ కు భారతరత్న అవార్డు లభించినప్పుడు ఎన్టీఆర్ కు కూడా కచ్చితంగా రావాలని కోరుకున్నారు. ఈ నేపథ్యంలోని రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ …తాను ఏ పార్టీలో ఉండడం లేదని స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యుడిగా తన తమ్ముడిగా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపాను అంతేకానీ పిఠాపురం రాజకీయాల్లో కూడా తాను పర్యటించడం లేదని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు. మన కుటుంబ మద్దతు తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు ఉంటుందని స్పష్టం చేశారు.
ఇక మీడియాలో వినిపిస్తున్న పుకార్ల ప్రకారం తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని తెలియజేశారు. తాను రాజకీయాల్లో వస్తానని పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారాలు చేస్తానని వచ్చే వార్తలు పుకార్లు గా చిరంజీవి కోట్టి పారేశారు. ఈ వార్తలను మీడియా వారు ప్రచారాలు చేశారని వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. మా తమ్ముడు కళ్యాణ్ బాబు కూడా నేను ప్రచారాల్లోకి రావాలని ఎప్పుడు కోరుకోలేదు. నేను కూడా తను బాగుండాలి తను అనుకున్నది తన జీవితంలో సాధించాలని కోరుకుంటాను తప్ప ప్రచారాలలో పాల్గొనబోనని చిరంజీవి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.