Allu Arjun : నంద్యాలలో అల్లు అర్జున్.. వైసీపీ పార్టీ తరఫున ప్రచారం...!
Allu Arjun : ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ లో సినీ గ్లామర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం అలాగే కూటమి కోసం పలువురు సినీ ప్రముఖులు ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ వైసీపీ తరఫున కూడా పలువురు సినీ ప్రముఖులు ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎవరు ఊహించని విధంగా నంద్యాల ఎన్నికల ప్రచారాలలో టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం ఇటీవల అల్లు అర్జున్ స్వయంగా రంగంలోకి దిగారు. నంద్యాల నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తూ బన్నీ ప్రచారాలు నిర్వహించారు. నంద్యాల ప్రజలందరూ రవిచంద్ర రెడ్డిని గెలిపించాల్సిందిగా కోరుతూ ఓటర్లకు పిలుపునిచ్చారు.
అలాగే బన్నీతో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డి కూడా రవిచంద్ర రెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితుడు. ఇక వారిద్దరి మధ్య ఉన్న సానుకూలత నేపథ్యంలోనే బన్నీ ప్రచారాలకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అంతేకాక 2019 ఎన్నికల్లో కూడా రవిచంద్ర రెడ్డికి బన్నీ బెస్ట్ విషెస్ తెలియజేశారు. అయితే బన్నీ నంద్యాల వస్తున్నారని రాకను ముందుగానే తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున శిల్పా రవిచంద్ర కిషోర్ ఇంటికి తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా అభిమానులతో నిండిపోయింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇంటి నుంచి బయటకు వచ్చి అభిమానులకు నమస్కారాలు తెలియజేశారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Allu Arjun : నంద్యాలలో అల్లు అర్జున్.. వైసీపీ పార్టీ తరఫున ప్రచారం…!
ఇదిలా ఉండగా మరోవైపు పవన్ కళ్యాణ్ యొక్క ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ బన్నీ సోషల్ మీడియా వేదికగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఎంచుకున్న మార్గం , ప్రజలకు సేవ చేయాలి అన్న నిబద్ధతను ఎంతో గౌరవిస్తున్నానని పేర్కొన్నారు. ఒక ఫ్యామిలీ మెంబర్ గా నా ప్రేమ మద్దతు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ కు ఉంటాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశలు ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నానని బన్నీ తన పోస్టులో రాసుకోచ్చారు.
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
This website uses cookies.