#image_title
Minister Gudivada Amarnath : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి వైసీపీ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీలను మారుస్తూ వస్తున్నారు. దీంతో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు లేకుండా చేస్తుంది.ఇక తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఆ ఖాతాలో పడ్డారు. ఈ క్రమంలోనే గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి వైసీపీ కార్యాలయంలో కొత్త నియోజకవర్గ ఇన్చార్జిగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించిన మలసాల భరత్ కుమార్ ను పరిచయ సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను అనకాపల్లి నియోజకవర్గం వదిలి వెళుతున్నందుకు బాధగా ఉందని వ్యాఖ్యానించారు. ఎంతో బాధతో వెళుతున్న కానీ మీ ఋణం ఎప్పటికైనా తీర్చుకుంటానంటూ గుడివాడ అమర్నాథ్ ఎమోషనల్ గా మాట్లాడారు.
అయితే తనకు టికెట్ దక్కలేదని, గుడివాడ అమర్నాథ్ పని అయిపోయిందని చాలా పత్రికలు వార్తలు రాస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలకు తాను కుంగిపోనని గుడివాడ స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అన్నిటికంటే ఒక పెద్ద పదవి ఉందని, అదే వైసీపీ కార్యకర్త పోస్ట్ అంటూ పేర్కొన్నారు. అంతకుమించి తనకు ఇంకేమీ అవసరం లేదు అని ఆయన అన్నారు. దీంతో కార్యకర్తగా జెండా మోయటానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో రావడానికి కష్టపడ్డామని అధికారం వచ్చాక కొంతమందికి పదవులు వచ్చాయని కొందరు ప్రచారం చేస్తున్నారని అలా ప్రచారం చేసేవాళ్లు పార్టీలో ఉండడం కంటే వెళ్ళిపోవడమే మంచిది అని వ్యాఖ్యలు చేశారు.
తన రాజకీయ జీవితం సంతృప్తిగా ఉందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు కొడుకు అనుభవించిన పదవి నాకు జగన్ ఇచ్చారని, రాజకీయాల్లో క్రింది స్థాయి నుంచి కార్పొరేటర్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశానని అది చాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి అయిన భరత్ కుమార్ కు సహకరించాలని కార్యకర్తలకు మంత్రి గుడివాడ అమర్ నాథ్ సూచించారు. అధికారమే లక్ష్యంగా సీఎం జగన్ చేస్తున్న మార్పులతో భాగంగా వైసీపీ ఇన్చార్జిల నియామకం జరుగుతుందని, అందరూ దీనిని అంగీకరించాలని గుడివాడ అమర్ నాథ్ పేర్కొన్నారు. అత్యున్నత శాఖలతో కూడిన మంత్రి పదవిని చేపట్టిన తాను కొంతమందికి ఉపకారం చేయలేకపోయానని, అయినప్పటికీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. తాను ఇతర జిల్లాలకు చెందిన వాడిని కాదని, చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన వాడిని అని అన్నారు.
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
This website uses cookies.