Minister Gudivada Amarnath : జగనన్న ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు .. ఎమోషనల్ అయిన వైసీపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Minister Gudivada Amarnath : జగనన్న ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు .. ఎమోషనల్ అయిన వైసీపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్..!!

Minister Gudivada Amarnath : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి వైసీపీ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీలను మారుస్తూ వస్తున్నారు. దీంతో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు లేకుండా చేస్తుంది.ఇక తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఆ ఖాతాలో పడ్డారు. ఈ క్రమంలోనే గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి వైసీపీ కార్యాలయంలో కొత్త నియోజకవర్గ ఇన్చార్జిగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించిన మలసాల భరత్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 January 2024,1:00 pm

Minister Gudivada Amarnath : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి వైసీపీ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీలను మారుస్తూ వస్తున్నారు. దీంతో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు లేకుండా చేస్తుంది.ఇక తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఆ ఖాతాలో పడ్డారు. ఈ క్రమంలోనే గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి వైసీపీ కార్యాలయంలో కొత్త నియోజకవర్గ ఇన్చార్జిగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించిన మలసాల భరత్ కుమార్ ను పరిచయ సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను అనకాపల్లి నియోజకవర్గం వదిలి వెళుతున్నందుకు బాధగా ఉందని వ్యాఖ్యానించారు. ఎంతో బాధతో వెళుతున్న కానీ మీ ఋణం ఎప్పటికైనా తీర్చుకుంటానంటూ గుడివాడ అమర్నాథ్ ఎమోషనల్ గా మాట్లాడారు.

అయితే తనకు టికెట్ దక్కలేదని, గుడివాడ అమర్నాథ్ పని అయిపోయిందని చాలా పత్రికలు వార్తలు రాస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలకు తాను కుంగిపోనని గుడివాడ స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అన్నిటికంటే ఒక పెద్ద పదవి ఉందని, అదే వైసీపీ కార్యకర్త పోస్ట్ అంటూ పేర్కొన్నారు. అంతకుమించి తనకు ఇంకేమీ అవసరం లేదు అని ఆయన అన్నారు. దీంతో కార్యకర్తగా జెండా మోయటానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో రావడానికి కష్టపడ్డామని అధికారం వచ్చాక కొంతమందికి పదవులు వచ్చాయని కొందరు ప్రచారం చేస్తున్నారని అలా ప్రచారం చేసేవాళ్లు పార్టీలో ఉండడం కంటే వెళ్ళిపోవడమే మంచిది అని వ్యాఖ్యలు చేశారు.

తన రాజకీయ జీవితం సంతృప్తిగా ఉందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు కొడుకు అనుభవించిన పదవి నాకు జగన్ ఇచ్చారని, రాజకీయాల్లో క్రింది స్థాయి నుంచి కార్పొరేటర్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశానని అది చాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి అయిన భరత్ కుమార్ కు సహకరించాలని కార్యకర్తలకు మంత్రి గుడివాడ అమర్ నాథ్ సూచించారు. అధికారమే లక్ష్యంగా సీఎం జగన్ చేస్తున్న మార్పులతో భాగంగా వైసీపీ ఇన్చార్జిల నియామకం జరుగుతుందని, అందరూ దీనిని అంగీకరించాలని గుడివాడ అమర్ నాథ్ పేర్కొన్నారు. అత్యున్నత శాఖలతో కూడిన మంత్రి పదవిని చేపట్టిన తాను కొంతమందికి ఉపకారం చేయలేకపోయానని, అయినప్పటికీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. తాను ఇతర జిల్లాలకు చెందిన వాడిని కాదని, చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన వాడిని అని అన్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది