minister roja strong counter to nara bhuvaneswari
Nara Bhuvaneswari : ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి వైసీపీ నేతలు చంద్రబాబును వదిలేసి ఆయన ఫ్యామిలీ మీద పడ్డారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, ఆయన కోడలు బ్రాహ్మణి, నారా లోకేష్, బాలకృష్ణపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అసలు ఏమాత్రం కూడా చాన్స్ ఇవ్వకుండా వాళ్లపై విరుచుకుపడుతున్నారు. మహిళలు అని కూడా చూడకుండా వైసీపీ నేతలు ఇష్టం ఉన్నట్టుగా చంద్రబాబు కుటుంబ సభ్యులపై విమర్శలు చేస్తున్నారు. మంత్రి రోజా అయితే ఆమె మహిళ అని కూడా మరిచిపోయి భువనేశ్వరి, బ్రాహ్మణిపై ఇష్టం ఉన్నట్టుగా మీడియా ముందు మాట్లాడుతున్నారు. అయితే.. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత, ఆయన జైలులో ఉన్న తర్వాత చాలామంది ఆయన అరెస్ట్ అయ్యారని తెలిసి గుండెపోటుతో మరణించారు. వాళ్ల కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి నిజం గెలవాలి అనే యాత్రను ఇటీవలే స్టార్ట్ చేశారు. ఆ యాత్రపై కూడా వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ యాత్రలో భాగంగా భువనేశ్వరి ప్రసంగించగా ఆమె వ్యాఖ్యలను కూడా వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారు. సాటి స్త్రీగా నా మనసులో ఏముందో అర్థం చేసుకోండి. నేను ఇక్కడికి రాజకీయాలు చేయడానికి రాలేదు అని భువనేశ్వరి స్పష్టం చేశారు.
ఇది మొదటి సారి నేను ఇలా పబ్లిక్ మీటింగ్ లోకి రావడం. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నిజం గెలవాలి.. అనే గురించి మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నిజం గెలవాలి అనేది ఒక పోరాటం. ఆ పోరాటం నా ఒక్కదానిదే కాదు. ఈ పోరాటం మీ అందరిదీ. ఈ పోరాటం మన రాష్ట్రం కోసం, మన కోసం, మన బిడ్డల కోసం, మన బావి భారత పౌరుల కోసం అని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. చంద్రబాబు రాష్ట్రాన్ని, తెలుగుదేశం పార్టీని క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లారు. నందమూరి తారకరామారావు నమ్మిన ప్రజలే మన బలం, ప్రజలకు సేవ చేయడమే మన పరమావధి అనే విషయాన్ని చంద్రబాబు ఇప్పటికీ నమ్ముతారు అని భువనేశ్వరి చెప్పారు. అయితే.. భువనేశ్వరి వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయాడు. ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలులోకి వెళ్లిన తర్వాత టీడీపీ నేతలు చేసే పనులు చూస్తే వీళ్లుకు ఏమైందో అర్థం కావడం లేదు అని మంత్రి రోజా చెప్పుకొచ్చారు. అసలు టీడీపీ నేతలు పిచ్చోళ్లలా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు చనిపోతే అది తట్టుకోలేక ఇంతమంది చనిపోయారు అని అంటున్నారు. ఎన్టీఆర్ కూతురును పట్టుకొని సతీమణి అని భువనేశ్వరిని అంటున్నారు. చంద్రబాబు ఎన్ని వేల కోట్లు దోచుకోకపోతే ఇన్ని రోజులు జైలులో ఉండాల్సి వస్తోంది. ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లయిట్ లో కోట్లాది రూపాయలు ఇచ్చి లాయర్లను దించుతున్నారు. ఏవిధంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కామ్ ల ద్వారా దోచుకున్నారో స్పష్టంగా అర్థం అవుతోంది.. అని రోజా దుయ్యబట్టారు.
నిజం గెలవాలి.. మిగితా స్కామ్ లలో కూడా చంద్రబాబు, లోకేష్ చేసిన దోపిడి గుర్తించి శాశ్వతంగా ఆయన్ను జైలులోనే ఉంచాలి అని కోరుతున్నాం. నిన్న భువనేశ్వరి ఒక మాట అన్నారు. రోజూ 2 నుంచి 3 గంటలు మాత్రమే పడుకున్నారట. మిగితా టైమ్ అంత ఏం చేశారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు ప్లాన్స్ వేశారా? అంటూ రోజా మండిపడ్డారు. భువనేశ్వరిని పెళ్లి చేసుకోవడానికి ముందు చంద్రబాబుకు ఉన్న ఆస్తి ఎంత.. ఇప్పుడు ఉన్న ఆస్తి ఎంత? అంటూ రోజా తెలిపారు. చెప్పే మాటలకు, చేసే వాటికి పొంతన ఉండటం లేదు. ఇంకా ఎన్ని అబద్ధాలు వినాల్సి వస్తుందో అని భయమేస్తోంది. ఇప్పటి వరకు బయటికి రాని మా అమ్మ ఇప్పుడు బయటికి వచ్చింది అంటున్నారు. ఎవరికోసం వచ్చింది అంటూ రోజా మండిపడ్డారు.
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు.…
Ishant Sharma : ఐపీఎల్ 2025లో 35వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ…
This website uses cookies.