MLA Kolikapudi : మరో వివాదంలో కొలికపూడి శ్రీనివాసరావు..!
ప్రధానాంశాలు:
MLA Kolikapudi : మరో వివాదంలో కొలికపూడి శ్రీనివాసరావు..!
MLA Kolikapudi : తిరువూరు టీడీపీ TDP ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఫిబ్రవరి 6న తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్త పల్లికంటి డేవిడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేకే ఆత్మహత్యచేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో డేవిడ్ చెప్పడంతో సంచలనమైంది. ‘పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేసినట్లు, కొలికపూడి దళిత ఎమ్మెల్యే అయినప్పటికీ మరో దళితుడినైన తనను వేధిస్తున్నట్లు ఆరోపించాడు.
![MLA Kolikapudi మరో వివాదంలో కొలికపూడి శ్రీనివాసరావు](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/MLA-Kolikapudi-1.jpg)
MLA Kolikapudi : మరో వివాదంలో కొలికపూడి శ్రీనివాసరావు..!
MLA Kolikapudi మరో వివాదంలో కొలికపూడి
తనపై అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నట్లు గోడు వెల్లబోసుకున్నాడు. తనలాంటోళ్లు ఎంతో మంది ఇబ్బందులను పైకి చెప్పుకోలేకపోతున్నట్లు తెలిపాడు. ఎమ్మెల్యే వేధింపులతో ఇక బతకడం అనవసరం అని, తన చావుతోనైనా తిరువూరు పార్టీ కార్యకర్తలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డేవిడ్ కోరాడు.
తన కుటుంబానికి సీఎం చంద్రబాబు నాయుడే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం డేవిడ్ విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, కొలికపూడిపై ఇటీవల సొంత పార్టీలో ఫిర్యాదులు ఎక్కువవడంతో పార్టీ క్రమశిక్షణ సంఘం కూడా ఆయనను సంజాయిషీ కోరింది. గతంలో దళిత క్రైస్తవుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కొలికపూడి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. MLA Kolikapudi Srinivasa Rao, Thiruvur TDP MLA, Thiruvur, TDP