Vemireddy Prashanti Reddy : జగన్ మీ ఇంట్లో వాళ్ల గురించి ఇలానే మాట్లాడితే ఊరుకుంటారా? : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. వీడియో
ప్రధానాంశాలు:
జగన్ తీరుపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Vemireddy Prashanti Reddy : జగన్ మీ ఇంట్లో వాళ్ల గురించి ఇలానే మాట్లాడితే ఊరుకుంటారా? : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. వీడియో
Vemireddy Prashanti Reddy : కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి Vemireddy Prashanti Reddy మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. అవినీతి, మహిళల పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై ఆమె ఘాటు విమర్శలు చేశారు. “మహిళలు ఏం తప్పు చేశారని మీ నాయకులు మమ్మల్ని అవమానిస్తున్నారు?” అంటూ ఆమె ప్రశ్నించడం, మహిళల పట్ల అగౌరవాన్ని ఏమాత్రం సహించబోమన్న స్పష్టమైన సంకేతం ఇచ్చింది. అధికారాన్ని విమర్శించినంత మాత్రాన నాయకులు మహిళలను వ్యక్తిగత స్థాయిలో అవమానించడం ఏమిటి? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Vemireddy Prashanti Reddy : జగన్ మీ ఇంట్లో వాళ్ల గురించి ఇలానే మాట్లాడితే ఊరుకుంటారా? : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. వీడియో
Vemireddy Prashanti Reddy “మహిళలు ఏం తప్పు చేశారని మీ నాయకులు మమ్మల్ని అవమానిస్తున్నారు.. జగన్..? – ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
“మీ ఇంట్లో వాళ్ల గురించి ఇలానే మాట్లాడితే ఊరుకుంటారా?” అనే ఆమె సూటిగా ప్రశ్నించింది. జగన్ తీరు పై ఆమె బాణం విల్లు వంటి పదునైన వ్యాఖ్యలు చేసింది. మహిళలను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడిన నాయకులపై జగన్ చర్య తీసుకోలేకపోవడమే కాదు
వారిని ప్రోత్సహించడం నిజంగా బాధాకరమని ఆమె అన్నారు. తనకు రాష్ట్రవ్యాప్తంగా అండగా నిలిచిన ప్రతీ వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపిన ప్రశాంతి, “ఇది మా పార్టీకి, మా నాయకత్వానికి దక్కిన గౌరవం” అని వ్యాఖ్యానించారు. మహిళల హక్కులు, గౌరవం కోసం తానెప్పటికీ వెనక్కి తగ్గబోనని ఆమె స్పష్టం చేశారు. మహిళా ఎమ్మెల్యేగా తన పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ అంతర్గత వ్యవహారాలను ప్రశ్నించడంలో ఆమె చూపిన ధైర్యం రాజకీయ శ్రేణుల్లో చర్చకు దారి తీస్తోంది.
మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రశ్నలు
మహిళలు ఏం తప్పు చేశారని మీ నాయకులు మమ్మల్ని అవమానిస్తున్నారు?
అవినీతి గురించి ప్రశ్నించినందుకు అవహేళన చేస్తున్నారు
మీ ఇంట్లో వాళ్ల గురించి ఇలానే మాట్లాడితే ఊరుకుంటారా?
ఇలాంటి నాయకులను మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు?… pic.twitter.com/0pVuqmiBAc
— BIG TV Breaking News (@bigtvtelugu) July 10, 2025