Chandrababu : ఆనందంలో ఏపీ ప్ర‌జ‌లు… చంద్ర‌బాబుకి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన మోదీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : ఆనందంలో ఏపీ ప్ర‌జ‌లు… చంద్ర‌బాబుకి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన మోదీ..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu : ఆనందంలో ఏపీ ప్ర‌జ‌లు... చంద్ర‌బాబుకి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన మోదీ..!

Chandrababu : గ‌త కొంత‌కాలంగా ఏపీ పాలిటిక్స్ గురించి జ‌నాల‌లో ఓ రేంజ్ చ‌ర్చ న‌డిచింది. ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు, కూట‌మి విజ‌యం సాధిస్తుందా, లేకుంటే వైసీపీనే మ‌రోసారి గెలిచి తీరుతుందా అనే సందేహం అంద‌రిలో ఉండ‌గా, ఎట్ట‌కేల‌కి దానిపై ఓ క్లారిటీ వ‌చ్చింది.ఏపీలో టీడీపీ కూటమి సునామీ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబుకు అనేక ప్ర‌ముఖుల నుండి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా ఫోన్ చేసి మాట్లాడారు .ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన ఏపీలో అద్భుత విజయాలు సాధిస్తుండడం పట్ల మోదీ… చంద్రబాబుపై అభినందనల వర్షం కురిపించారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడం పట్ల చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Chandrababu : చంద్ర‌బాబు హ‌వా..

ఈ క్రమంలో చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి అభినందించారు. మరిన్ని లోక్ సభ స్థానాల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. అయితే చంద్ర‌బాబు చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి పూర్తి మెజార్టీ దక్కే అవకాశం లేకపోవడంతో ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారం చేపట్టడం కోసం చంద్ర‌బాబుకి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. చంద్రబాబు కూటమిని సమన్వయం చేసేందుకు కన్వీనర్ గా నియమించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ..చంద్రబాబుకు ఫోన్ చేసి జాతీయ రాజకీయాలపై చర్చ జరిపినట్లుగా తెలుస్తోంది.

Chandrababu చంద్ర‌బాబుకి ఫోన్ చేసి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన మోదీ

Chandrababu : చంద్ర‌బాబుకి ఫోన్ చేసి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన మోదీ..

యూపీ, బీహార్, మహారాష్ట్ర , బెంగాల్ వంటి చోట్ల అనుకున్న విధంగా బీజేపీ ఫలితాలు సాధించలేకపోవడంతో చాలా వెనుకబడిపోయింది. పూర్తి మెజార్టీకి 272 స్థానాలు కావాల్సి ఉండగా.. బీజేపీ నెంబర్ 240 దగ్గరే ఆగిపోయే అవకాశం కనిపిస్తోంది.అయితే ఇతర ఎన్డీఏ మిత్రులు అరవై సీట్ల వరకూ సాధిస్తున్నారు. దీంతో మూడో సారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టడానికి పెద్దగా అవరోధం లేదనుకోవచ్చు. కాక‌పోతే ఇంకొన్ని సీట్స్ కావ‌లసి ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబుని క‌న్వీన‌ర్‌గా నియ‌మించిన‌ట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆయ‌న ఇతర పార్టీలను కూడా ఎన్డీఏ వైపు ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి అయితే బీజేపీకి ఇప్పుడు చంద్ర‌బాబు అవ‌స‌రం చాలా ఉంది కాబ‌ట్టి ఆయ‌న అడిగిన స్పెష‌ల్ స్టేట‌స్ కూడా ఇచ్చే అవ‌కాశం ఉంది. అలానే ఏపీ అభివృద్ధికి కూడా మోదీ ప్ర‌భుత్వం త‌గు సాయం కూడా చేస్తార‌ని అంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది